English | Telugu
అప్పు కోసం కళ్యాణ్.. రాహుల్ ని బ్లాక్ మెయిల్ చేసిన మైఖేల్!
Updated : Oct 19, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -231 లో... రాజ్ కావ్య ఇద్దరిని దొంగలు అంటూ షాప్ ఓనర్ పోలీసులని పిలుస్తాడు. ఆ తర్వాత మేం దొంగలం కాదని రాజ్, కావ్య చెప్పే ప్రయత్నం చేసిన వాళ్ళు నమ్మరు. అయితే మీరు భార్యభర్తలు అనడానికి సాక్ష్యం చూపించండని పోలీస్ అడుగుతాడు. అయ్యో ఫోన్ ఇంటిదగ్గరే మర్చిపోయామని చెప్తారు. రాజ్ కావ్య ఇద్దరు పోట్లాడుకుంటారు. వాళ్ళు అలా చిలిపిగా గొడవ పడడం చూసి.. మీరు భార్యభర్తలని నేను ఒప్పుకుంటున్న అని పోలీస్ చెప్తాడు. దాంతో రాజ్ కావ్య ఇద్దరు అక్కడ నుండి ఇంటికి బయల్దేరుతారు.
మరొకవైపు రుద్రాణి నిద్రలేచేసరికి తన కాస్ట్లీ చీరలు అన్ని కప్పుకొని పడుకొని ఉన్న కనకాన్ని చుసిన రుద్రాణి.. తనని చిరాకుగా లేపుతుంది. నా చీరలు ఎందుకు చుట్టుకున్నావని అడుగుతుంది. చలి భరించలేక కప్పుకున్నా అని చెప్పి, అన్ని చీరలు తీసి రుద్రాణికి ఇచ్చి వెళ్తుంది. మరొక వైపు రాహుల్ కి మైఖేల్ కాల్ చేస్తాడు. మైఖేల్ అని అనగానే రాహుల్ కంగారుగా గదిలో నుండి బయటకు వస్తాడు. రాహుల్ కంగారుగా రావడం చూసి ఏమైందని స్వప్న రాహుల్ వెనకాలే వస్తుంది. ఆ తర్వాత మైఖేల్ మాట్లాడుతూ.. పోలీస్ లు పట్టుకొని పోగానే నీ పని అయిపొయిందని అనుకోకు. నన్ను బయటకు తీసుకొని రా, లేదంటే నువ్వు నీ భార్యని చంపమని చెప్పిన ఆడియో రికార్డులు ఉన్నాయని రాహుల్ నీ బెదిరిస్తాడు మైఖేల్. అప్పుడే స్వప్న వచ్చి ఎవరతను? అంత కంగారు పడుతున్నావని రాహుల్ ని అడుగుతుంది. రాహుల్ ఏదో కవర్ చేసి స్వప్నని లోపలికి పంపిస్తాడు. ఆ తర్వాత మైఖేల్ ని బయటకు తీసుకొని వస్తానని చెప్తాడు. వీడు ఇలాగే ఎప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉంటాడు. బెయిల్ పై తీసుకొని వచ్చి చంపెయ్యాలని రాహుల్ అనుకుంటాడు.
మరొక వైపు కళ్యాణ్ ఎన్ని సార్లు కాల్ చేసిన అప్పు లిఫ్ట్ చేయదు. దాంతో కళ్యాణ్ డైరెక్ట్ గా ఇంటికి వచ్చి మీ అమ్మ బట్టలు తీసుకొని రమ్మని చెపింది. నిన్ను కూడ తీసుకొని రమ్మందని అప్పుని తీసుకొని వెళ్తాడు కళ్యాణ్. మరొక వైపు రాజ్ కావ్య ఇద్దరు ప్రొద్దున ఇంటికి వస్తారు. ఇంట్లో వాళ్ళు చూసి ఎక్కడికి వెళ్లారని అడుగుతారు.. రాజ్ బయటకు వెళదామని తీసుకొని వెళ్లారని కావ్య చెప్పి వెళ్ళిపోతుంది. రాజ్ కూడా తర్వాత మాట్లాడుతానంటు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.