English | Telugu

జీతాలు పెంచమని లెక్చరర్స్ డిమాండ్.. పరిష్కరించిన రిషి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -898 లో.. వసుధార దగ్గరికి కాలేజీ ఫాకల్టీ వచ్చి జీతాలు పెంచాలని అడుగుతారు. ఇప్పటికిప్పుడు జీతాలు పెంచాలంటే ఎలా కొంచం టైం కావాలని వసుధార చెప్తుంది. మాకు జీతాలు పెంచితేనే క్లాస్ లు చెప్తామని ఫాకల్టీ చెప్పి వెళ్ళిపోతారు. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు. వీళ్ళతో ఎవరైనా ఇలా మాట్లాడిస్తునారా అని వసుధారకి అనుమానం కలుగుతుంది.

మరొక వైపు ఆ ఫాకల్టీ వెళ్లి శైలేంద్రని కలుస్తారు. మీరు చెప్పినట్టే ఎండీ దగ్గరికి వెళ్లి మాట్లాడాము సర్ అని ఫాకల్టీ చెప్పగానే.. మంచి పని చేశారు. జీతాలు పెంచే వరకు కాలేజీకీ రాకండి వాల్లే జీతాలు పెంచుతారని శైలేంద్ర చెప్తాడు. మరొకవైపు వసుధారతో రిషి ఫోన్ మాట్లాడుతాడు. అన్ని ఫైల్స్ చెక్ చెయమని రిషి చెప్తాడు. ఆ తర్వాత ఫాకల్టీ వచ్చిన దాని గురించి రిషికి వసుధార చెప్తుంది. నువ్వేం టెన్షన్ పడకు నా దగ్గర ఒక ఐడియా ఉందని వసుధారకి రిషి చెప్తాడు. కాసేపటికి వసుధార దగ్గరకు రిషి వస్తాడు. మీరు ఏదో ఐడియా ఉందని అన్నారని వసుధార అడుగుతుంది.

లెక్చరర్ కోసం పోస్ట్ పెట్టాను. వాళ్ళు శాలరీకి పని చేసే వాళ్ళు కాదని రిషి వసుధారకి చెప్పగానే వసుధార హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత స్టూడెంట్స్ లీడర్ ని రిషి పిలిచి లెక్చరర్స్ గురించి చెప్తాడు. అంతే కాకుండా నేను కూడ లెక్చరర్ గా జాయిన్ అవుతున్నానని రిషి చెప్పగానే స్టూడెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత రిషిని వసుధార హగ్ చేసుకోని.. లవ్ యూ అని చెప్తుంది. ఇంత చిన్న ప్రాబ్లమ్ కి కంగారు ఎందుకని వసుధారతో రిషి చెప్తాడు.

ఆ తర్వాత శైలేంద్ర, ఫణింద్ర, దేవయాని ముగ్గురు కలిసి మహేంద్ర దగ్గరకు వస్తారు. మీరు అక్కడకు రండి అని దేవయాని అంటుంది. లేదు డాడ్ ఇక్కడ కూడా అలాగే ఉన్నారు ఇంకెక్కడికైన కొన్ని రోజులు తీసుకొని వెళ్ళాలని అనుకుంటున్నానని రిషి అంటాడు. ఎక్కడకని శైలేంద్ర అడుగుతాడు. ఎక్కడకైతే నీకెందుకని ఫణింద్ర అంటాడు. నేను కూడ వస్తానని దేవయాని అడుగుతుంది. వద్దని ఫణింద్ర అంటాడు. శైలేంద్ర నువ్వు వెళ్ళు వాళ్లతో అని దేవయాని చెప్పగానే.. సరే అని శైలేంద్ర అంటాడు. పానకంలో పుడక లాగా నువ్వు ఎందుకని శైలేంద్రతో ఫణీంద్ర అంటాడు. నేను వెళ్తున్నాను. వాళ్ళని నేను చూసుకుంటానని వసుధార చెప్తుంది. కాసేపటికి మహేంద్రతో ఫణీంద్ర మాట్లాడి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.