English | Telugu
అరకులో కొత్త క్యారెక్టర్.. ఇది కదా కావాల్సింది!
Updated : Oct 31, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -907 లో.. వసుధార, రిషిలని మహేంద్ర బయటకు వెళ్లి ఎంజాయ్ చేసి రండి అంటూ పంపిస్తాడు. రిషి, వసుధార ఇద్దరు సరదాగా బయటకు వెళ్తారు. అక్కడ ఉన్న నేచర్ ని ఎంజాయ్ చేస్తుంటారు. వసుధార చాలా హ్యాపీగా ఉంటుంది. ఇన్ని రోజుల తర్వాత మనం ఇలా చాలా సంతోషంగా ఉన్నామని రిషి అంటాడు. మా అమ్మ వల్లే మనం ఈ రోజు ఇలా ఉన్నామని రిషి అంటాడు.
ఆ తర్వాత రిషి కాఫీ తీసుకొని వస్తాడు. ఇద్దరు కాఫీ షేర్ చేసుకుంటారు. మరొక వైపు శైలేంద్ర, దేవయాని ఇద్దరు మాట్లాడుకుంటారు. అప్పుడే అరకు నుండి శైలేంద్ర మనిషి ఫోన్ చేసి.. వసుధార, రిషి ఇద్దరిని వీడియో కాల్ లో చూపిస్తాడు.. వాళ్ళు అలా హ్యాపీగా ఉండడం చూసిన శైలేంద్ర.. వాళ్ళు ఉండడానికి వీలు లేదని ఆ రౌడీకీ చెప్తాడు.. నేను ఎలా చంపుతానో, మీరు చుడండి అని రౌడీ వీడియో కాల్ ఆన్ చేసి పెడతాడు. అందులో నేచర్ నీ ఫోటోస్ తీస్తున్న అనుపమ.. దేవయానికి కన్పిస్తుంది. రిషి వసుధారల వెనకాల ఉన్న వ్యక్తి ఎవరు క్లారిటీగా చూపించమని దేవయాని అనగానే.. ఆ రౌడీ తనని చూపిస్తాడు. అనుపమని చూసిన దేవయాని ఒక్కసారిగా షాక్ అవుతుంది.
నువ్వు అక్కడ ఉండకు. వాళ్ళని నువ్వేం చెయ్యలేవని రౌడీకి దేవయాని చెప్తుంది. శైలేంద్ర అతన్ని వెనక్కి రమ్మని చెప్పు అని అనగానే.. శైలేంద్ర వద్దని చెప్తాడు. ఆ తర్వాత శైలేంద్ర చెంప చెళ్లుమనిపిస్తుంది. ఆ తర్వాత రౌడీని వెనక్కి రమ్మని శైలేంద్ర చెప్పగానే.. ఒక్కసారి స్టార్ట్ అయ్యాక ఆపడం ఉండదని ఆ రౌడీ అంటాడు. ఆ తర్వాత రిషి వసుధారలపై ఆ రౌడీ కత్తి తో ఎటాక్ చెయ్యబోతుంటే అనుపమ చూసి.. అతనిపైకి కర్రని విసురుతుంది. దాంతో రౌడీ వెంటనే అక్కడ నుండి పారిపోతాడు.
మరొక వైపు అనుపమ గురించి శైలేంద్రకి చెప్తుంది దేవయాని. జగత, అనుపమ, మహేంద్ర ముగ్గురు ఫ్రెండ్స్.. వాళ్ళిద్దరి పెళ్లి చేసింది అనుపమ. ఇప్పుడు అనుపమ పిలిస్తేనే అక్కడికి వెళ్ళారా అని శైలేంద్రతో దేవయాని చెప్తుంది.. మరొక వైపు రిషి, వసుధారలని తీసుకొని అనుపమ రిసార్ట్ కి వెళ్తుంది. అక్కడ జరిగింది మహేంద్రకు చెప్తుంది. అప్పుడే రిషి, వసుధార ఇద్దరు మహేంద్రకి కొడుకు కోడలని అనుపమకి అర్థమవుతుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు వెళ్లిపోండని అనుపమ చెప్తుంది. అ తర్వాత మీ పేరేంటని వసుధార అడుగుతుంది. నా పేరు అనుపమ అని చెప్పగానే.. రిషి, వసుధార ఇద్దరు ఆశ్చర్యం గా చూస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.