English | Telugu

కోడలికి కడపు లేదని తెలుసుకున్న అత్త ఏం చేయనుంది?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -240 లో.. నేను చెప్పిన పని కావ్య చెయ్యలేదని అపర్ణకి రుద్రాణి చెప్తుంది. మీరు నాకు ఏం పని అప్పజెప్పలేదని కావ్య అంటుంది. నువ్వు మర్చిపోయి నన్ను అంటున్నవా అని రుద్రాణి అనగానే.. వారి మధ్యలో రాజ్ కలుగజేసుకొని కావ్య అబద్ధం చెప్పదు అందుకే ఎవరికి భయపడుదని కావ్యకి సపోర్ట్ చెయ్యగానే.. ఏంటి మరి నేను అబద్ధం చెప్తున్నానని అంటున్నవా అని రుద్రాణి అంటుంది.

ఆ తర్వాత నేను అలా అనలేదని రాజ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. చూసావా వదిన నీ కొడుకు ఆ కావ్యకి ఎలా సపోర్ట్ చేస్తున్నాడో అని అపర్ణని రెచ్చగొట్టేలా రుద్రాణి మాట్లాడుతుంది. మరొక వైపు స్వప్న ఇబ్బంది పడుతుంది. ఈ చీర కట్టుకోవాలి అంటే ఇబ్బందిగా ఉంది. ఎక్కడ నా బెల్ట్ కింద పడిపోతుందో అని స్వప్న అనుకుంటుంది. అప్పుడే స్వప్న దగ్గరికి రుద్రాణి వచ్చి.. ఏంటి ఆలోచిస్తున్నావంటూ అడుగుతుంది. స్వప్నతో ఎప్పుడు లేని విధంగా రుద్రాణి మాట్లాడేసరికి.. మీరు ఎప్పుడు లేని విధంగా నాతో పాజిటివ్ గా మాట్లాడుతున్నారని స్వప్న అనగానే.. నా వారసుడిని నీ కడుపులో మోస్తూన్నావ్ ఈ మాత్రం ఉండదా అని రుద్రాణి డౌట్ గా.. స్వప్న కడుపుని టచ్ చెయ్యబోతుంటే స్వప్న ఆపుతుంది. అప్పుడే రుద్రాణికి స్వప్నకి కడుపు లేదన్న విషయం అర్థమవుతుంది. ఆ తర్వాత స్వప్న గదిలో రిపోర్ట్స్ ని రుద్రాణి ఫోటో తీసుకుంటుంది. మరొక వైపు ఫంక్షన్ కి వచ్చిన ఒక ఆమె అప్పుని చూసి అబ్బాయని అనుకుంటుంది. ఆ తర్వాత అందరూ తనని చీర కట్టుకొని రమ్మని చెప్పగా.. తను సరే అని అంటుంది. మరొక వైపు రుద్రాణి స్వప్న గదిలో తీసుకున్న రిపోర్ట్స్ ఫోటోని అబార్షన్ కోసం టాబ్లెట్స్ ఇచ్చిన డాక్టర్ కి పంపిస్తుంది. ఆ డాక్టర్ రిపోర్ట్స్ స్వప్న రిపోర్ట్స్ చూసి క్లారిటీ ఇస్తానని చెప్తుంది.

మరొక వైపు అప్పు చీర కట్టుకొని వస్తుంటే అందరూ షాక్ అవుతారు. నీకు చీర సెట్ అవ్వలేదంటూ అప్పుని అందరు ఎగతాళి చేస్తారు. కళ్యాణ్ కూడా ఎగతాళి చేసేసరికి అప్పు బాధపడుతుంది. మరొక వైపు అనామిక అందంగా చీరకట్టులో వస్తుంది. చూసావా అనామిక ఎంత అందంగా ఉందోనని కళ్యాణ్ అనగానే అప్పు ఎమోషనల్ అవుతు వెళ్ళిపోతుంది. మరొక వైపు స్వప్నకి కడుపు లేదన్న విషయం రాహుల్ కి రుద్రాణి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.