English | Telugu

నా కోడ్ వర్డ్ సైతాన్...సంయుక్త అడిగిన ప్రశ్న కామెడీగా సుమ ఆన్సర్

సుమ అడ్డా ఈ వీక్ షోలో డెవిల్ మూవీ మెరిసింది. ఈ మూవీ హీరో హీరోయిన్స్ సంయుక్తా మీనన్, నందమూరి కళ్యాణ్ రామ్ వచ్చారు. ఐతే సంయుక్త సుమని ఒక ప్రశ్న అడిగింది "మీకు ఒక కోడ్ నేమ్ పెట్టుకోవాల్సి వస్తే" అని అడిగింది "ఎనర్జీ" అని టక్కున చెప్పింది సుమ. "కరెక్ట్" అని కళ్యాణ్ రామ్ చప్పట్లు కొట్టాడు. "కానీ మనం పేరు అలా పెట్టకూడదు కదా ..కళ్యాణ్ రామ్ గారికి రివర్స్ లో డెవిల్ అని పెట్టినట్లు నేను సైతాన్" అని పెట్టుకుంటాను అని సుమ చెప్పేసరికి అందరూ నవ్వేశారు. "అది రాజీవ్ గారు పిలిచే పేరా" అని కామెడీ చేసాడు కళ్యాణ్ రామ్.

తరువాత సంయుక్తాని, కళ్యాణ్ రామ్ ని సుమ కొన్ని ప్రశ్నలు అడిగింది "సంయుక్త మీ అందం రహస్యం" అనేసరికి "మా అమ్మా..తను అందంగా ఉంటుంది కాబట్టి నేను అందంగా ఉన్నాను. ఐతే ఈ రోజు త్రి లేయర్స్ మేకప్ లో ఉన్నాను" అనేసరికి అందరూ నవ్వేశారు. "తారక్, అద్విత, సౌర్య రామ్, అభయ్ రామ్, భార్గవ్ రామ్.. వీళ్లల్లో అల్లరి బాగా ఎవరు చేస్తారు" అని కళ్యాణ్ రామ్ ని అడిగేసరికి " భార్గవ్ బాగా అల్లరి చేస్తాడు. అందరికంటే చాలా చిన్నవాడు కాబట్టి అల్లరిగా ఉంటాడు" "ప్రొడ్యూసర్, హీరో, బెస్ట్ హజ్బెండ్ ..ఈ రోల్స్ లో ఏ రోల్ చేయడం అంటే మీకు ఇష్టం" అనేసరికి "హజ్బెండ్ రోల్ చేయడం ఇష్టం అది కరెక్ట్ చేస్తే మిగతా రెండు హ్యాపీగా జరిగిపోతాయి" అని చెప్పాడు కళ్యాణ్ రామ్. ఆ ఆన్సర్ కి సుమ చాల ఎగ్జాయిట్ ఫీల్ అయ్యింది "ఈ జీవిత సత్యాన్ని ప్రతీ భర్తా తెలుసుకోవాలి... రాజీవ్ కనకాల కూడా మిమ్మల్ని అలాగే ఫాలో అవుతాడు" అని చెప్పింది సుమ. ఇలా ఈ వారం సుమ అడ్డా షో ఎంటర్టైన్ చేసింది. నందమూరి హీరో కల్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా నటించిన డెవిల్ మూవీ మిక్స్‌డ్ రెస్సాన్స్ సొంతం చేసుకుంది

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..