English | Telugu

తెల్ల జుట్టు వచ్చేస్తోంది..మా అన్నను పెళ్లి చేసుకో


రష్మీ వయసు పెరుగుతున్న తరగని అందంతో హోస్ట్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ తో బుల్లితెర మీద రచ్చ చేస్తూ ఉంటుంది. స్మాల్ స్క్రీన్ మీద హిట్ పెయిర్ గా అందరి హృదయాలను దోచుకున్న సుధీర్ - రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొంతకాలం క్రితం వరకు వీళ్ళు లేనిదే ఏ షో లేదు అన్నట్టుగా ఉండేది. కానీ సుధీర్ మాత్రం సిల్వర్ స్క్రీన్ మీదకు వెళ్లిపోయేసరికి బుల్లితెర మీద ఒంటరిగా మిగిలిపోయింది రష్మీ.

ఇక ఇప్పుడు ఇయర్ ఎండింగ్ సెలెబ్రేషన్స్ లో మునిగితేలుతోంది రష్మీ. ఆ పిక్స్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. "2023 ఆఖరి క్షణాలను నాకు ఇష్టమైన వాళ్ళతో ఇలా స్పెండ్ చేశా" అంటూ కొన్ని పిక్స్ ని సోషల్ మీడియాలో వదిలింది.ఇక నెటిజన్స్ కామెంట్స్ మస్త్ పెడుతున్నారు. "తెల్ల జుట్టు వచ్చేస్తోంది..త్వరగా సుదీర్ అన్నను పెళ్లి చేసుకో" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ ఆదివారం నాడు న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ లో భాగంగా రష్మీ పెళ్లి పార్టీ పేరుతో ఒక ఈవెంట్ రాబోతోంది.

ఆ ప్రోమోలో ఆది ఒక డైలాగ్ వేసాడు "ఇన్ని రోజులు నువ్వు టీవీ రేటింగ్స్ కోసం ఏదేదో చేశావ్ .. కానీ నిజంగా నువ్వు ఎవరిని చేసుకోవాలనుకుంటున్నావో అతడ్ని మేమూ చూడాలనుకుంటున్నాం" అని అడిగేసరికి . రష్మీ సిగ్గుపడుతూ "ఒక అమ్మాయికి కాబోయే వాడు ఇలా ఉండాలని కొన్ని కోరికలు ఉంటాయి.. పొడుగ్గా ఉండాలని" అంటూ ఏదో చెప్తుండగానే ఆమె వెనక నుంచి ఒక తెల్లటి వ్యక్తి స్టేజి మీదకు వచ్చి రష్మీ పక్కన నిలబడ్డాడు. ఇంతకు ఎవరతను అంటూ సుధీర్ ఫాన్స్ అంతా ప్రోమో కింద కామెంట్స్ లో అడుగుతున్నారు. "రష్మీకి ఎన్నిసార్లు పెళ్లి చేస్తారయ్యా, అన్న ఉండాల్సిన చోట వీడెవడ్రా, ఆపండ్రా బాబు పెళ్లి గోల" అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఇతను ఎవరో తెలియాలంటే కొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు.