English | Telugu
బిగ్ బాస్ కంటెస్టెంట్ పేరుతో బుక్ రిలీజ్...
Updated : Dec 30, 2023
ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఇయర్ ఎండింగ్ సెలెబ్రేషన్స్ అదిరిపోయే రేంజ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో బుల్లితెర స్టార్స్ అంతా వచ్చారు. "వీళ్ళందరూ ఓకే కానీ తెల్ల గడ్డాన్ని కూడా వదలడం లేదు..ఇంతకూ న్యూ ఇయర్ ప్లాన్స్ ఏమిటి" అంటూ ప్రభాకర్ ని అడిగింది శ్రీముఖి. "ఇదే నా న్యూ ఇయర్ ప్లాన్.. సాల్ట్ అండ్ పెప్పర్ అంటూ అమ్మాయిలంతా నా వెంట పడుతున్నారు." "పేరుకు 90 కానీ చేసే పనులన్నీ 20 ఏళ్ళ వాళ్ళు చేసినట్టు ఉన్నాయి" అని కౌంటర్ వేసింది శ్రీముఖి.
తర్వాత షోకి వచ్చిన జాకీని చూసి షాకయ్యింది. "ఏమిటి జాకీ గారు పార్టీకి మీరు మొదటి సారి హరిత గారు లేకుండా రావడం..ఏమిటది " అనేసరికి "ఆ ఆనందం చూస్తున్నారా నాలో" అంటూ తెగ ఉత్సాహంతో మెలికలు తిరిగాడు జాకీ. ఇక సీరియల్ బ్యాచ్ వాళ్ళు వచ్చారు ... అందులో మానస్ ని చూసిన శ్రీముఖి "31st నైట్ ప్లాన్స్ ఏమిటి" అని అడిగేసరికి " పెళ్లయ్యింది కదా" అని మానస్ చెప్తుండగా మధ్యలో కావ్య ఎంట్రీ ఇచ్చి " మల్లెపూలు, హల్వా" ఉంటాయి అని ఆన్సర్ చెప్పింది.
దానికి మానస్ ఎం మాట్లాడాలో తెలీక సైలెంట్ గా ఉన్నాడు. ఇక ఈ షోకి అమరదీప్ ఫాన్స్ వచ్చారు..రావడమే కాదు ఒక సర్ప్రైజ్ కూడా తెచ్చారు. " అన్నా అందరికి మీరు రన్నర్ కావొచ్చు కానీ మాకు మాత్రం మీరు విన్నర్...అమర్ అన్న తోపు..దమ్ముంటే ఆపు" అంటూ నినాదాలు చేశారు. తర్వాత "బుక్ ఆఫ్ విన్నర్" అనే టైటిల్ తో పబ్లిష్ చేసిన ఒక బుక్ ని అమరదీప్ చేతుల మీదగా రిలీజ్ చేయించారు ఆయన ఫాన్స్ . "ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ మీద ఒక బుక్ వచ్చిందంటే మా తమ్ముడు నిజంగా సాధించాడురా " అంటూ శ్రీముఖి పొగిడేసింది.