English | Telugu

సెల్ఫీలంటే ఇష్టం ఉండదు అన్న సుమ

సుమ గురుంచి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. తన మాటల చాతుర్యంతో ఎలాంటి షోనైనా అలవోకగా చేసేస్తుంది. అలాంటి సుమకి సెల్ఫీలు దిగడమంటే అస్సలు ఇష్టం ఉండదట. ఏదైనా ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు దాన్ని ముగించుకుని వచ్చేయడమే అలవాటు. ఈ సెల్ఫీలు ఇవన్నీ అనుకోకుండా అప్పటికప్పుడు జరిగే పనులు. వీటి వల్ల టైం వేస్ట్ అవుతుంది. అదే టైం లో ఇంకో చోట ఏదైనా షూటింగ్ ఉండొచ్చు, ఏదైనా కార్యక్రామినికి టైం ఐపొతూ ఉండొచ్చు , లేదంటే స్కూల్నుంచి పిల్లలనైనా తీసుకు రావాల్సిన అవసరం రావొచ్చు.

ఇలా సెల్ఫీలు తీసుకుంటూ ఉంటే తర్వాత జరగాల్సిన పనులకు బ్రేక్ పడుతుంది. అనుకున్న టైంకి చేయలేకపోతాం అందుకే నాకు సెల్ఫీలంటే పెద్దగా ఇష్టం ఉండదు అంటూ ఒక ఇంటర్వ్యూలో తన మనసులో మాట చెప్పుకొచ్చింది సుమ. ఇన్ కంటాక్స్ కట్టలేదని, రాజీవ్ తో విడాకులు తీసుకుంటున్నానని ఇలాంటి చాలా రూమర్స్ వస్తాయ్ కదా అప్పుడు మీరెలా ఫీలవుతారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు వాటిని అస్సలు పట్టించుకోను అని చెప్పుకొచ్చింది.