English | Telugu

‘బలగం’ నటి రూపాలక్ష్మి వార్నింగ్ ఇచ్చిన ఆది!

ఢీ షో ఈ వారం బలగం నటి రూపాలక్ష్మి, ఆది కామెడీతో మంచిగా ఎంటర్టైన్ చేసింది. ఈ షోలోకి దీపికా పిల్లి పెద్దమ్మగా వచ్చారు రూప..రావడంతోనే ఆది ఆమె మీద పంచులు వేసాడు. "ఏంట్రా నా కూతురి మీద డైలాగులు వేస్తున్నావ్ ...నువ్వు చెప్పిన అబద్దాలు వినడానికి నేను ఎలా కనిపిస్తున్నా" అని రూప అడిగేసరికి "మీకేం అత్తయ్య కత్తిలా ఉన్నారు..ఐనా మీ అమ్మాయే నా అందం చూసి లవ్ చేస్తోంది" అని అది అన్నాడు. "అసలు నువ్వెలా ఉన్నవో తెలుసా మా గొడ్ల సావిడిలో అప్పుడే ఈనిన గేదెలా ఉన్నావ్" అనేసరికి ఆమెను కూల్ చేయడానికి అన్నట్టు "అత్తయ్య మీ బుగ్గల్ని ఎలా పెంచారు" అని అడగడంతో రూప నవ్వేశారు.

"అసలు వీడికి పనొచ్చో లేదో చూడాలి అని రూప ఆదికి ఒక క్లాత్ ఇచ్చి ఈ ఫ్లోర్ మొత్తం తుడువు..అందులో నా ముఖం కనిపించాలి" అనేసరికి "ప్రశాంతంగా పంచులేసుకునేవాడిని ఇప్పుడు నా పరిస్థితి ఇలా ఐపోయింది" అన్నాడు ..ఇంతకాలో దీపికా పిలిచి పెళ్లి చేసుకుందాం అనేసరికి ఆది రూప ముందు కొంచెం ఓవర్ యాక్షన్ చేసాడు. "ఒసేయ్..ఒక ఆడదాన్ని ఢీ స్టేజి మీద తన్నానన్న అపకీర్తి నాకు రానివ్వకు" అనేసరికి దీపికా పిలిచి ఆదిని పెళ్లి చేసుకోనంటూ మాట మార్చింది. వెంటనే ఆది రూప దగ్గరకు వచ్చి పిల్లిలా వెళ్లి చేతులు కట్టుకుని నిలబడేసరికి "చేతికి చీపురు ఇచ్చి ఈ ఫ్లోర్ మొత్తం ఊడు" అని పనిష్మెంట్ ఇచ్చేసింది. ఇలా ఢీ స్టేజి మీద ఆది, రూప, దీపికా చిన్న స్కిట్ చేసి ఎంటర్టైన్ చేశారు. బలగం మూవీలో రూప లక్ష్మి నటన అద్భుతంగా ఉంటుంది. తన సహజ నటనతో ఆడియన్స్ ని అలరించారు రూప. అలాగే ఈ మూవీకి డైరెక్టర్ జబర్దస్త్ కమెడియన్ వేణు. బలగం మూవీ ఎన్నో అవార్డ్స్ కూడా వచ్చాయి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.