English | Telugu

ఢీలో పుట్టినరోజు వేడుకలు..కంటెస్టెంట్ బర్త్ డే డిసైడ్ చేసి విషెస్ చెప్పిన శేఖర్ మాష్టర్

ఢీ షోలో మంచి డ్యాన్సులు చూసాం, మంచి స్కిట్స్ కూడా చూసాం..కానీ కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ ని ఈ వారం షోలో చూడొచ్చు. ఈ డాన్స్ జోడీస్ లో సైరా రాయలసీమ టీమ్ మంచి డాన్స్ పెర్ఫార్మెన్సెస్ తో ప్రతీ వారం అలరిస్తూ ఉంటుంది. ఇందులో రాజశేఖర్, సురేష్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ వారం ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ప్రదీప్ వీళ్ళ ఫ్రెండ్షిప్ గురించి అందరికీ తెలిసేలా చేసాడు.. వాళ్ళను స్టేజి మీదకు పిలిచి వాళ్ళ ఫ్రెండ్ షిప్ ఎలా, ఎప్పుడు స్టార్ట్ అయ్యిందో అడిగాడు. "ఒక కాంపిటీషన్ లో ఇద్దరం కలిసాం .. ఢీ 14 , 15 లో కూడా ఆడిషన్స్ ఇచ్చాము ..ఐతే సెలెక్ట్ కాకపోయేసరికి మన ఫేస్ వల్ల మనం సెలెక్ట్ కావట్లేదని అనుకున్నాం. కానీ ఇప్పుడు అది అబద్దం అని తెలిసింది.. ఢీ 16 స్టేజి మీద ఈరోజు నిలబడ్డాం.

సురేష్ కి ఇంగ్లీష్ రాదన్న విషయం నాకు తెలీదు. కానీ నాకు కొంచెం అర్ధమవుతుంది కానీ అంత బాగా రాదు. మాస్టార్లు ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడితే చెప్పు అనేవాడు కానీ నాకు రాదు కాబట్టి అంతగా అర్ధమయ్యేది కాదు..కానీ ఎన్ని చేసినా ఫ్రెండ్ కదా" అనేసరికి సురేష్ మాట్లాడాడు "అన్నతో ఇన్నేళ్ళుగా ఉంటున్నా కానీ అన్న పుట్టినరోజు ఎప్పుడో తెలీదు నేను చేయడానికి. కానీ నా బర్త్ డే చాలా గ్రాండ్ గా చేస్తాడు" అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. "సింహరాశి మూవీ టైములో పుట్టానని మాత్రమే తెలుసు" అని రాజశేఖర్ చెప్పేసరికి పూర్ణ, శేఖర్ మాష్టర్ వచ్చి కేక్ తెప్పించి స్టేజి మీద రాజశేఖర్ తో కట్ చేయించారు. ఇక నుంచి నీ పుట్టినరోజు ఆగష్టు 2 న అని చెప్పి అందరూ విషెస్ చెప్పి కేక్ తినిపించారు. తర్వాత కొరియోగ్రాఫర్ ఐశ్వర్య టీమ్ పెర్ఫార్మ్ చేసిన డాన్స్ పెద్దగా బాలేదని..నెక్స్ట్ టైం బాగా పెర్ఫార్మ్ చేయాలని, చెప్పిన థీమ్ కి చేసిన డాన్స్ కి పొంతన కుదరలేదని జడ్జెస్ చెప్పారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.