English | Telugu

కామెడీ మాత్రమే కాదు ఏ రోల్ ఐనా చేస్తా !

ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం అనే పేరు ఎవరికీ తెలియకపోవచ్చు కానీ "అదో తుత్తి" అనే డైలాగ్ వింటే చాలు ఏవీఎస్ అని చెప్పేస్తారు. ఆయన పూర్తి పేరు అది. కానీ ఏవీఎస్ గా మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. ఈయన సైలెంట్ గా చేసే కామెడీకి ఆడియన్స్ పడీపడీ నవ్వాల్సిందే. ఆయన కమెడియన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా. కాలేజీ టైంలో నాటకాలు వేసేవారు. ఆ తర్వాత బాపు డైరెక్షన్ లో "మిస్టర్ పెళ్ళాం" మూవీ ఆఫర్ వచ్చింది. ఆ సినిమా ఎంతో సూపర్ డూపర్ హిట్టో అందరికీ తెలిసిందే. ఆయన దాదాపు 500 పైగా చిత్రాల్లో కమెడియన్ గా నటించి మెప్పించారు.

ఇప్పుడు ఆయన తనయుడు ప్రదీప్ కూడా ఇండస్ట్రీ వైపు వచ్చేసాడు. ప్రదీప్ మల్టీ టాలెంటెడ్. బిజినెస్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ చేసి యాడ్ ఏజెన్సీ పెట్టుకుని ఎన్నో పెద్ద కంపెనీస్ కి, కార్పొరేట్ , ఫ్యాబ్రికేషన్ కంపెనీస్ కి యాడ్స్ తయారు చేస్తుంటాడు. ఇటీవల ఆయన వాళ్ళ నాన్న గురించి తన గురించి ఎన్నో విషయాలు చెప్పారు. వాళ్ళ నాన్నగారు చనిపోయే టైంకి పెద్దగా అప్పులేమి లేవన్నారు. లివర్ ప్రాబ్లెమ్ వచ్చినప్పుడు ప్రదీప్ అక్క శ్రీప్రశాంతి తన లివర్ ని డొనేట్ చేసిన విషయం అందరికీ తెలిసింది.

"అక్క అంటే నాన్నకు చాలా ఇష్టం..నా కన్నతల్లి అంటూ ఉంటారు ఎప్పుడూ. అక్కకి, వాళ్ళ ఫామిలీకి డాక్టర్స్ బాగా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇక ఇప్పుడు అక్క హ్యాపీ, లివర్ డొనేట్ చేసాక అక్కకి పాప కూడా పుట్టింది" అని చెప్పాడు ప్రదీప్ . "కమెడియన్ బ్రహ్మానందం అంకుల్ కి ఫోన్ చేస్తే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. బాబూమోహన్, సాయికుమార్ అంకుల్ వాళ్ళు కూడా బాగా మాట్లాడాతారు. 2012 నుంచి నాకు డైరెక్షన్ చేయాలనే ఇంటరెస్ట్ ఉండేది. యాక్టింగ్ విషయానికి వస్తే ప్రస్తుతానికి ఆడిషన్స్ ఇస్తున్నా. ఎవరైనా రోల్స్ ఇస్తుంటే చేస్తున్నా. అలాగే ఇప్పుడు నాలుగు భాషల్లో "సాచి" అనే థ్రిల్లర్ ని మూవీ రిలీజ్ కావడానికి రెడీగా ఉంది. నాన్నగారిలా కామెడీ మాత్రమే కాదు ఏ రోల్ ఐనా చేస్తాను. మా ఆక్టివ్ స్టూడియోస్ బ్యానర్ నుంచి "కాంట్రాక్టు " అనే హారర్ మూవీ కూడా రెడీ అయ్యింది. త్వరలో రిలీజ్ కాబోతోంది. అలాగే సాచి మూవీ రిలీజ్ అయ్యాక కాస్త గ్యాప్ తీసుకుని దాని సీక్వెల్ కూడా తీయడానికి ప్లాన్ చేస్తున్నాం.

ఆక్టివ్ స్టూడియోస్ అని నాన్నగారు పేరు పెట్టారు. ఆయన ముందు నేనెప్పుడూ ఆక్టివ్ గా ఉండేవాడిని కాదు గాని నాన్న వెనక మాత్రం ఫుల్ హైపర్ ఆక్టివ్ నేను. ఆయన ముందు అలా ఉండడం చూసి నేను ఎప్పుడూ ఆక్టివ్ గా ఉండాలని ఆ పేరు పెట్టారేమో" అంటూ ప్రదీప్ నవ్వుతూ చెప్పాడు.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..