English | Telugu
సోనాక్షితో డేటింగ్ చేయాలని వైష్ణవ్ అనుకుంటున్నాడా?
Updated : Sep 1, 2022
'ఉప్పెన' మూవీతో స్టార్ డం అందుకున్న మెగా ఫామిలీ హీరో వైష్ణవ తేజ్. 'ఉప్పెన', 'కొండపొలం' తర్వాత కేతికశర్మ హీరోయిన్ గా "రంగ రంగ వైభవంగా" మూవీలో నటించాడు. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఈ మూవీ టీమ్ బుల్లితెర షోస్ లోకి ఎంట్రీ ఇస్తూ ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు కేతిక, వైష్ణవ్ ఇద్దరూ 'నిఖిల్ తో నాటకాలు' షోకి వచ్చి ఎన్నో విషయాలు చెప్పారు.
"వైష్ణవ్ తేజ్ పెళ్లి చేసుకుంటే గనక ఒక సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చే అమ్మాయి ఐతే బాగుంటుంది. ఎందుకంటే అతని ఫామిలీ కూడా అలాంటిదే కదా" అంది కేతిక. ఇక వైష్ణవ్ హీరో కాకపోయి ఉంటే సైంటిస్ట్ అయ్యేవాడని, చాలా సార్లు ఈ విషయం తనతో చెప్పాడంది. ఇక ఫుడ్ విషయానికి వస్తే బిర్యానీ అంటే ఇష్టమని చెప్పింది. హీరోయిన్స్ లో డేటింగ్ చేయాల్సి వస్తే సోనాక్షి సిన్హాతో చేస్తాడని వైష్ణవ్ గురించి ఎన్నో విషయాలు చెప్పింది. కేతిక శర్మ గురించి వైష్ణవ్ తేజ్ చెప్తూ 'పుష్ప' మూవీ అంటే ఆమెకు చాలా ఇష్టమని అలాగే బిర్యానీ, చేపల పులుసు అంటే బాగా ఇష్టపడుతుందని చెప్పాడు.
తర్వాత డైరెక్టర్ గిరీశాయను ఫోన్ లో యాంకర్ అడిగాడు, "ఇద్దరూ షూట్ లో బాగా అల్లరి చేసేవాళ్ళా" అని .. ఇద్దరితో పెద్ద సమస్య లేదు, బాగా కో- ఆపరేట్ చేసేవారని గిరీశాయ చెప్పాడు.