English | Telugu
అనంత శ్రీరామ్ లవ్ స్టోరీ...ఆ అమ్మాయి ఎవరో తెలుసా!
Updated : Oct 24, 2025
సరిగామప లిటిల్ చాంప్స్ లేటెస్ట్ ప్రోమో ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఇక స్టేజి మీదకు ఎంట్రీ ఇవ్వగానే "ఫేస్ బాగుండాలంటే గ్లో ఉండాలా, మేకప్ వేయాలా" అని సుధీర్ అడిగేసరికి "ఫేస్ ఉండాలి" అంటూ సింగర్ శైలజ ఫన్నీ కౌంటర్ వేశారు. తర్వాత అనంత శ్రీరామ్ వర్షిణితో డ్యూయెట్ స్టెప్స్ వేస్తూ వచ్చేడు. "మీరు మంచి లిరిక్ రైటర్ అనుకున్నాను..ఏంటి ఇవన్నీ" అని అడిగాడు సుధీర్. లిరిక్ రైటర్ కి ఫీలింగ్స్ ఉండవా, లిరిక్ రైటర్ కి ప్రేమలుండవా" అని అనంత శ్రీరామ్ రివర్స్ లో సెటైర్ వేసాడు. "గూగుల్ లో కొడతారు డాట్ కామ్. నాకు అందరి కంటే ఇష్టం అనంత శ్రీరామ్" అంటూ వర్షిణి చెప్పింది.
"ఇది టెలికాస్ట్ ఐన తర్వాత మీరు ఎక్కడ కనిపించిన కొడతారు" అంటూ సుధీర్ మళ్ళీ కౌంటర్ ఇచ్చాడు. ఇక ప్రోమో చివరిలో "నచ్చిన అమ్మయినల్లా ప్రేమించానండి కాలేజ్ లో. చెపుదామనుకునేలోపు ఆ అమ్మాయి ఎవరో ఒకరితో ప్రేమలో ఉండేదండి." అంటూ పాపం అనంత శ్రీరామ్ తన లవ్ స్టోరీ గురించి చెప్పేసరికి అనిల్ రావిపూడి వచ్చి హగ్ చేసుకుని మరీ ఓదార్చాడు. "ఇంత బాధ లోపల పెట్టుకుని మమ్మల్నందరినీ నవ్విస్తున్నావా" అంటూ ఫీలైపోయాడు. "మీ ఇద్దరూ వన్ సైడ్ లవ్ గురించి బాధపడుతున్నట్టు లేదు. పెళ్ళాం బాధితుల్లాగా నాకు అనిపిస్తోంది" అంటూ వీళ్ళను చూసి హోస్ట్ సుధీర్ సెటైర్ వేసాడు. తర్వాత ఇద్దరు పిల్లలు వచ్చి "కన్యాకుమారి కనపడదా దారి" అనే సాంగ్ పాడేసరికి అనిల్ రావిపూడి కవిత చెప్పాడు. "మబ్బులపైనుంచి మంచుకొండలు లోయలోకి ఇంద్రధనుస్సు వేసిన జారుడు బల్ల మీద ఇళయరాజా గారి సంగీతం వింటూ హాయిగా తలవాల్చినట్టు ఉంది.. మీరు సింగర్స్ కాదు. ఇప్పుడే పూల తేనెను పీల్చుకొచ్చిన సీతాకోక చిలుకలు " అని చెప్పేసరికి అనంత శ్రీరామ్ ఐతే "నాకు ఇంటరెస్ట్ పోయింది" అంటూ లేచి వెళ్ళిపోయాడు ఫన్నీగా.