English | Telugu
అంబటి అర్జున్ ఫేక్.. రైతుబిడ్డ గురించి అలా మాట్లాడటం కరెక్టేనా?
Updated : Oct 13, 2023
బిగ్ బాస్ సీజన్-7 లో కొత్త కంటెస్టెంట్స్ రాకతో వేరే లెవెల్ కి వెళ్ళిందనే చెప్పాలి. ఇక 2.0 లో వచ్చిన కంటెస్టెంట్స్ లలో అంబటి అర్జున్ బంఢారం బయటపడింది. నిన్న రాత్రి జరిగిన లైవ్ డిస్కషన్ లో అర్జున్ తన ముసుగు తీసేసి మాట్లాడటం మొదలెట్టాడు.
హౌజ్ లో సోమవారం నామినేషన్ల తర్వాత నుండి కొత్త కంటెస్టెంట్స్ (పోటు గాళ్ళు), పాత కంటెస్టెంట్స్ (ఆటగాళ్ళు) మధ్య టాస్క్ లు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే నిన్న జరిగిన టాస్క్ లలో ఆటగాళ్ళ టీమ్ వరుసగా రెండింట్లో గెలిచి సత్తాచాటింది. ఇక ఆటగాళ్ళ టీమ్ లో ఉన్న అమర్ దీప్, శివాజీ , ఆట సందీప్, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్, యావర్, ప్రియాంక జైన్, టేస్టీ తేజ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు.
ఆట మధ్యలో సందీప్ మాస్టర్ చీట్ చేశాడని పూజామూర్తి అంది. అది చూడకుండా ఎలా అంటావని శోభా శెట్టి అంటుంది. ఇక వదిలేయ్ అని అంబటి అర్జున్ అన్నాడు. ఆ తర్వాత అందరు పడుకున్నాక అంబటి అర్జున్, పూజా మూర్తి ఇద్దరు హౌజ్ లోని కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకోవడం మొదలెట్టారు.
అంబటి అర్జున్ హౌజ్ లోకి వచ్చే ముందు శివాజీ, పల్లవి ప్రశాంత్ దమ్మున్న ఆటగాళ్లు అని చెప్పాడు. ఇక నిన్న జరిగిన లైవ్ ఎపిసోడ్ లో మాత్రం.. ఆ పల్లవి ప్రశాంత్ గాడికి అసలు ఆటే రాదు, ఒకసారి మేమిద్దరం తలపడితే వాడికి నేనేందో తెలుస్తుందని, శివాజీ సపోర్ట్ లేకపోతే ఆడలేడని, ఫౌల్ గేమ్ ఆడుతున్నాడని పూజామూర్తితో అంబటి అర్జున్ అన్నాడు. అయితే పల్లవి ప్రశాంత్ ని అంబటి అర్జున్ ని తక్కువ చేసి మాట్లాడాడంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.
ఇన్ని రోజులు హౌజ్ లో ఎక్కువ గొడవలకు పోకుండా, టాస్క్ లలో అదరగొడుతూ ఒక కెప్టెన్ లా పోటుగాళ్ళ టీమ్ ని నడిపిస్తున్న అంబటి అర్జున్.. ఇప్పుడు స్ట్రాంగ్ ప్లేయర్ కాదని అందరి ఆట చూసి వచ్చి ఫేక్ గా ఉంటున్నాడని, అతని మాస్క్ నాలుగు రోజుల్లోనే తోసేశాడంటూ బిగ్ బాస్ రివ్యూలు ఇచ్చే యూట్యూబర్స్ అందరు చెప్పుకొస్తున్నారు. మరి అంబటి అర్జున్ ఫేక్ అని హౌజ్ లో వాళ్ళు కనిపెట్టగలరా? అసలు పల్లవి ప్రశాంత్ ని తక్కువ చూస్తున్న అంబటి అర్జున్ మాటతీరు సరైనదేనా ఇలాంటి ఆసక్తిర విషయాలతో బిగ్ బాస్ ముందు రోజుల్లో మరింత ఉత్కంఠభరితంగా మారనున్నట్లు తెలుస్తుంది.