English | Telugu
కొత్త ఎండీగా ఊహించని వ్యక్తి.. షాక్ లో ఆ ఇద్దరు!
Updated : Oct 14, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -893 లో.. రిషి ఎండీ సీట్ గురించి ఏం నిర్ణయం తీసుకున్నాడోనని శైలేంద్ర దేవాయని ఇద్దరు అనుకుంటారు. అప్పుడే రిషిపై నుండి కిందకి వస్తాడు. రిషి ఎండీ పదవి గురించి ఏం ఆలోచించావని దేవయాని అడుగుతుంది. నేను ఎండీ కుర్చీలో కూర్చోనని నేను చెప్పాను కదా అని రిషి అంటాడు.
ఆ తర్వాత ఇంక ఎన్ని రోజులు ఎండీ చైర్ ఖాళీగా ఉంటుంది. జగతి ఉన్నప్పుడే కాలేజీ వెనుకబడింది. ఇంకా ఇప్పుడు ఎవరు లేకుంటే కాలేజీ పరిస్థితి ఏంటి? ఇప్పటికైన నిర్ణయం తీసుకో నాకు అయితే నువ్వు ఎండీగా ఉంటేనే బాగుంటుందనిపిస్తుందని దేవయాని అంటుంది. అవును ఎండీగా మన కుటుంబం నుండి ఉండాలి. ఆ నిర్ణయం బోర్డు మెంబెర్స్ కి వదిలెయ్యకు రిషి అని శైలేంద్ర చెప్తాడు. నువ్వు కూర్చో అన్నయ్య అంటే నాకు ఇష్టం లేకున్నా నువ్వు కూర్చోమంటే కూర్చుంటాను అని శైలేంద్ర అంటాడు. పక్కన ఉన్న దేవయాని నటిస్తుంది. నువ్వు ఎందుకు? రిషినే ఉంటే బాగుంటుందని కావాలనే దేవయాని అంటుంది. మన కుటుంబంలో నుండి ఒకరికి కూర్చోపెడతానని రిషి అంటాడు. అప్పుడే వసుధార వచ్చి రిషిని తీసుకొని వెళ్తుంది. మళ్ళీ కిందకి వచ్చిన వసుధార.. దేవయాని, శైలేంద్ర ఇద్దరికి కాలేజీని మీరు సొంతం చేసుకోలేరని సవాల్ విసురుతుంది. కాలేజీలో ఎండీగా రేపు చైర్ లో కూర్చునేది నేనే అని శైలేంద్ర కలలు కంటడు.
మరుసటి రోజు ఉదయం అందరూ కాలేజీకీ వెళ్తారు. చాలా రోజుల తర్వాత రిషి కాలేజీలో అడుగుపెడుతాడు. రిషికి స్టూడెంట్స్ గ్రాంఢ్ గా వెల్ కమ్ చెప్తారు. అప్పుడే మినిస్టర్ కూడా వస్తాడు. అందరూ కలిసి జగతి ఫోటోకీ నమస్కారం చేస్తారు. ఆ తర్వాత మీటింగ్ లో కూర్చొని ఉంటారు. కాలేజీ ఎండీ గురించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇందులో వాళ్ళ పేరు ఉంది ఇప్పుడు రివీల్ చేస్తున్నానని మినిస్టర్ చెప్తాడు. అందులో నా పేరు ఉంటుందని శైలేంద్ర అనుకోని సంబరపడతాడు. ఈ కాలేజీ కొత్త ఎండీ వసుధార అని మినిస్టర్ చెప్పగానే.. శైలేంద్ర దేవాయాని ఇద్దరు షాక్ అవుతారు. కాసేపటికి నా నిర్ణయం మీకు సరైనదని అనుకుంటున్నారని భావిస్తున్నానని రిషి అంటాడు. వసుధారకి ఎండీగా ఉండే అర్హతలు ఉన్నాయని రిషి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.