English | Telugu
టేస్టీ తేజ నామినేషన్.. అంబటి అర్జున్ ఎలిమినేషన్!
Updated : Oct 31, 2023
బిగ్ బాస్ సీజన్-7 లో కొత్త ట్రెండ్ నడుస్తుంది. అదే టేస్టీ తేజ నామినేషన్. తేజ ఎవరిని నామినేట్ చేస్తే వాళ్ళు హౌస్ లో నుండి వెళ్ళిపోతున్నారు.
మొదట కిరణ్ రాథోడ్ ని లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉందని చెప్పి టేస్టీ తేజ చెప్పాడు. తను ఎలిమినేట్ అయింది. ఆ తర్వాత దామిణి గేమ్ లో తేజని ఏదో అందని, తనకి నెగెటివ్ వైబ్స్ వచ్చాయంటూ చెప్పి నామినేషన్ వేయగా తను ఎలిమినేట్ అయి బయటకొచ్చేసింది. ఇక శుభశ్రీని గేమ్ పరంగా తక్కువ ఆడిందని, ఇంకాస్త ఆడితే బాగుండని చెప్పి తేజ నామినేట్ చేయగా తను ఎలిమినేట్ అయింది. ఇక బిగ్ బాస్ చరిత్రలోనే ఆట సందీప్ ఏడు వారాలు నామినేషన్ లో లేకుండా హౌస్ లో ఉన్నాడు. అలాంటి ఆట సందీప్ ని సేఫ్ ప్లేయర్ అని యావర్ మొదట నామినేట్ చేశాడు. ఆ తర్వాత తేజ వచ్చి.. మీరు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అన్న. ఒక్కసారి నామినేషన్ లోకి వెళ్ళి వస్తే మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుందనే పాజిటివ్ వైబ్స్ తో నామినేట్ చేస్తున్నాని ఆట సందీప్ ని తేజ నామినేట్ చేశాడు. దాంతో ఆట సందీప్ ఎలిమినేట్ అయ్యాడు.
ఇక హౌస్ లోని అందరికి టేస్టీ తేజ నామినేషన్ చేస్తున్నాడంటే భయపడుతున్నారు. సోమవారం జరిగిన నామినేషన్ లో అంబటి అర్జున్ , రతికలని టేస్టీ తేజ నామినేట్ చేశాడు. మూడు వారాలుగా అర్జున్ ఒక్కసారి కూడా నామినేషన్ లో లేడు. అందుకే పాజిటివ్ వైబ్స్ తో నామినేట్ చేస్తున్నానని టేస్టీ తేజ అనడంతో హౌస్ లోని వాళ్ళంతా నవ్వుకున్నారు. గతవారం ఆట సందీప్ ని కూడా ఇలాగే నామినేట్ చేయడంతో అతను ఎలిమినేట్ అయ్యాడని హౌస్ మేట్స్ అంతా నవ్వుకున్నారు. టేస్టీ తేజ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు బిగ్ బాస్ అంటూ అంబటి అర్జున్ కామెడీ చేయగా.. నీకు నేను చెప్పింది ఇష్టమైతేనే ఒప్పుకోమని టేస్టీ తేజ బతిమాలాడు. ఇప్పుడు టేస్టీ తేజ నామినేషన్ వల్ల అంబటి అర్జున్ ఎలిమినేషన్ అవుతాడా లేదా చూడాలి మరి.