English | Telugu
శివాజీ ఫెయిర్ నామినేషన్.. అమర్ దీప్ బూతులతో మరోసారి!
Updated : Oct 31, 2023
బిగ్ బాస్ సీజన్-7 లో సోమవారం నామినేషన్ ప్రక్రియ వాడివేడిగా సాగింది. అసలు కథ ఇప్పుడే మొదలైంది అన్నట్టుగా ఒకరినొకరు తిట్టుకుంటూ నామినేట్ చేసుకున్నారు. అయితే ఈ నామినేషన్ లో కొన్ని రీజన్స్ సిల్లీగా అనిపించాయి.
నామినేషన్ ప్రక్రియని మొదలుపెట్టిన పల్లవి ప్రశాంత్.. అమర్ దీప్ ని నామినేట్ చేసాడు. రతిక, భోలే షావలిని ప్రియాంక జైన్ నామినేట్ చేసింది. శోభాశెట్టి, అమర్ దీప్ లని అంబటి అర్జున్ నామినేట్ చేశాడు. ఆ తర్వాత రతిక వచ్చి ప్రియాంక జైన్, శోభాశెట్టిలని నామినేట్ చేసింది. నన్ను బాంబ్ అని అనడం, ఒకరి దగ్గర ఆగిపోయావని అనడం నాకు నచ్చలేదంటూ అందుకే నామినేట్ చేస్తున్నానని ప్రియాంకతో రతిక అంది.
ఆ తర్వాత అమర్ దీప్ ని భోలే షావలి నామినేట్ చేశాడు. ఆ రోజు నామినేషన్ లో నువ్వు నన్ను మధ్యలో మాట్లాడొద్దని పగిలిపోద్ది అని చెప్పి కుర్చీని బాగా తన్నావ్. ఆ బూతు మాట్లాడం కరెక్ట్ కాదని అది నాకు నచ్చలేదని అమర్ దీప్ తో భోలే షావలి అనగా.. ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ లో అలా వచ్చిందని అమర్ దీప్ అన్నాడు. ఇక వీరిద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధంలో అమర్ దీప్ మళ్ళీ నోరుజారాడు. అది విన్న ప్రియాంక.. ఏది పడితే అది మాట్లాడొద్దు, ఆ తర్వాత సారీ చెప్పొద్దు. ప్రతీసారీ అదే చేయొద్దని అమర్ దీప్ తో ప్రియాంక అంది. నేను మాట్లాడింది బూతు కాదు. ఆయన చెప్పింది కరెక్ట్ అని అనొద్దు. నా కోపం ఇంతే ఎవరి కోసం నన్ను నేను మార్చుకోను. అది నాకు బూతు కాదని అమర్ దీప్ అనగా.. మాకు అది బూతు అనిపిస్తుందని ప్రియాంక అంది.
గొప్ప ప్లేయర్ వెళ్ళిపోయాడు. తేజ నువ్వు తప్పు చేశావ్. నువ్వు ఆ రోజు నామినేట్ చేయడం వల్ల ఆట సందీప్ వెళ్ళిపోయాడు. ఒక గొప్ప ప్లేయర్ వెళ్ళిపోయాడనే బాధ నాకు ఉంది. అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నానని టేస్టీ తేజని శివాజీ నామినేట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన టేస్టీ తేజ.. అంబటి అర్జున్, రతికలని నామినేట్ చేశాడు. మూడు వారాలుగా అర్జున్ ఒక్కసారి కూడా నామినేషన్ లో లేడు. అందుకే పాజిటివ్ వైబ్స్ తో నామినేట్ చేస్తున్నానని టేస్టీ తేజ అనడంతో హౌస్ లోని వాళ్ళంతా నవ్వుకున్నారు. గతవారం ఆట సందీప్ ని కూడా ఇలాగే నామినేట్ చేయడంతో అతను ఎలిమినేట్ అయ్యాడని హౌస్ మేట్స్ అంతా నవ్వుకున్నారు. టేస్టీ తేజ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు బిగ్ బాస్ అంటూ అంబటి అర్జున్ కామెడీ చేయగా.. నీకు నేను చెప్పింది ఇష్టమైతేనే ఒప్పుకోమని టేస్టీ తేజ బతిమాలాడు.