English | Telugu

జపాన్ బాస్కెట్ బాల్ ఫెడరేషన్ లీగ్‌లో సత్తా చాటిన ఆరడుగుల అందగాడు

టాలీవుడ్ లో అంత పేరు లేకపోయినా క్యూట్ గా కనిపిస్తూ అప్పుడప్పుడు అలరించే హీరో అరవింద్ కృష్ణ...ఆరడుగుల బుల్లెట్టు అనే సాంగ్ కి పర్ఫెక్ట్ గా సరిపోయే కటౌట్ మనోడిది. ఇక ఈ అందగాడు కొన్ని మూవీస్ లో కూడా నటించాడు. 'ఇట్స్ మై లవ్ స్టోరీ', 'అడవి కాచిన వెన్నెల', ఋషి' వంటి మూవీస్ లో యాక్ట్ కూడా చేసాడు. 'ప్రేమమ్', 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీస్ లో స్పెషల్ రోల్స్ లో కనిపించదు. అలాగే అరవింద్ కృష్ణ నటించిన 'గ్రే : ది స్పై హూ లవ్డ్ మి' మూవీ ఈ ఇయర్ రిలీజ్ అయ్యింది.

ఇక రీసెంట్ గా 'సుడిగాలి' సుధీర్ హీరోగా నటించిన 'కాలింగ్ సహస్ర'లో ఆయన గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు. అలా ఒక పక్క మూవీస్ లో చేస్తూ టైం దొరికినప్పుడల్లా బాస్కెట్ బాల్ ఆడుతూ ఉంటాడు. ఆ పిక్స్ ని తన గేమ్ ని కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు ది ఇంటర్నేషనల్ బాస్కెట్ బాల్ ఫెడరేషన్ లీగ్‌లో పాల్గొన్నాడు స్పోర్ట్స్ పర్సన్ అరవింద్ కృష్ణ. ఫైబా జపాన్‌లో లాస్ట్ వీక్ సాగామిహర 3BL లీగ్‌ను నిర్వహించింది .

ఇందులో ఒక్కొక్క టీమ్ నుంచి ముగ్గురు బాస్కెట్ బాల్ ప్లేయర్స్‌ పార్టిసిపేట్ చేయగా మన హైదరాబాద్ టీమ్ కెప్టెన్ గా అరవింద్ కృష్ణ కూడా పాల్గొన్నాడు. అందులో అరవింద్ కృష్ణ టీమ్ క్వాలిఫైయర్స్‌కి ఎంపికైంది. ఈ లీగ్‌లో తదుపరి గేమ్స్‌ని వచ్చే ఏడాది నిర్వహించనున్నారు. ఇక ఇండియా నుంచి పాల్గొన్న ఏకైక ప్లేయర్ అరవింద్ కృష్ణ మాత్రమే. అలాగే అరవింద్ కృష్ణ "ఏ మాస్టర్ పీస్" అనే మూవీ లో కూడా నటించాడు. ఇలాంటి ప్రతిష్టాత్మక చాంపియన్ షిప్‌లో పార్టిసిపేట్ చేయడం తనకు ఎంతో గర్వంగా, గౌరవంగా ఉందన్నాడు అరవింద్ కృష్ణ .