English | Telugu
ఏమిటో బిగ్ బాస్ సెలబ్రిటీస్ అంతా తిరుమలకు చెక్కేస్తున్నారు
Updated : Dec 7, 2023
బిగ్ బాస్ సీజన్ 6 సెలబ్రిటీస్ అంతా కూడా గ్రూప్ గా తిరుమల వెళ్లి ఆ శ్రీవారిని దర్శనం చేసుకుని వస్తున్నారు. అదేంటో తెలీదు కానీ నిన్న గీతూ, శ్రీ సత్య వెళ్లారు. ఇక ఇప్పుడు ఇద్దరూ వెళ్లారు. ఇక ఈ పిక్స్ ని వాళ్ళ ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకున్నారు. "ఓం నమో వెంకటేశాయ" అని టాగ్ పెట్టుకున్నారు కూడా...అర్జున్ కళ్యాణ్ నార్మల్ కాస్ట్యూమ్ లో కనిపించగా ఆర్జె సూర్య మాత్రం సాంప్రదాయక దుస్తుల్లో కనిపించారు. ఇక వీళ్ళ పిక్స్ ని చూసిన నెటిజన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. ఇదే బిగ్ బాస్ సీజన్ లో తన అందమైన ముఖంతో, నవ్వుతో, అద్భుతమైన హెయిర్ స్టైల్ తో అందరినీ మెస్మోరైజ్ చేసిన వాసంతి కృష్ణన్ కూడా కామెంట్ చేసింది.
"బ్లెస్సింగ్స్ రా నాన్న" అని కామెంట్ చేసేసరికి . "నీకు ఈవెనింగ్ బ్లెస్సింగ్స్ ఇస్తాం లే" అని ఆర్జే సూర్య రిప్లై ఇవ్వగా "థ్యాంక్స్ పాపా, సి యు సూన్" అంటూ అర్జున్ కళ్యాణ్ రిప్లై ఇచ్చాడు. ఉదయాన్ని తిరుమల వెళ్లిన ఈ ఇద్దరూ కూడా రాజ గోపురం దగ్గర నిలబడి ఒక వీడియో చేసి దాన్ని వాళ్ళ ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకున్నారు.
"నడక దర్శనానికి వెళ్తున్నాం...నేను తిరుమలకు రావడం ఇదే మొదటి సారి అర్జున్ కళ్యాణ్ కి రెండో సారి..స్వామి వారు ఆయన సన్నిధానానికి చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి అని కోరుకుంటున్నాం" అంటూ ఆర్జే సూర్య ఆ వీడియోలో చెప్పాడు. ఆర్జే సూర్య ఈమధ్య కాలంలో స్క్రీన్ మీద ఎక్కడా కనిపించడం లేదు. ఇక అర్జున్ కళ్యాణ్ ఇండస్ట్రీ మీద ఇష్టంతో, ప్రేమతో అమెరికాలో నటనలో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ తర్వాత ‘ప్రేమమ్’ లో ఒక క్యారెక్టర్ చేశాడు. సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు.