English | Telugu

గీతా ఆర్ట్స్ అని అందుకే పెట్టారు..మగధీరకు మూడు రేట్లు వచ్చింది.. మొత్తం పోయింది

ఆలీతో సరదాగా షోలో అల్లు అరవింద్ సెకండ్ పార్ట్ లో ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పారు. "అల్లు అరవింద్ కి గీత అనే గర్ల్ ఫ్రెండ్ ఉంది కాబట్టి గీత ఆర్ట్స్ పెట్టారా " అని ఆలీ అడిగేసరికి " దాసరి సత్యనారాయణమూర్తి గారు, వీర్రాజు గారు అనే పార్టనర్స్ ఉండేవారు...వాళ్ళ ముందు మా నాన్న గీత ఆర్ట్స్ బ్యానర్ పెడదామని ఒక ప్రొపోజల్ పెట్టారు. ఎందుకు అంటే భగవద్గీత సారాంశం ఏమిటి అంటే ప్రయత్నం మాత్రమే మనది రిజల్ట్ అనేది మన చేతుల్లో లేదు. కాబట్టి ఈ పేరు పెడితే సరిపోతుంది అని అన్నారు.

అంటే ఈ బ్యానర్ మీద వచ్చే మూవీస్ హిట్ కొట్టాలి అంటే అదంతా ప్రేక్షక దేవుళ్ళ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఈ పేరే సరిపోతుందని ఆయన చెప్పారు. మా నాన్న గారు గీత ఆర్ట్స్ బ్యానర్ మీద చాలా సినిమాల్లో నటించారు. ఏవో కొద్ది సినిమాల్లో తప్ప. క్యారెక్టర్ ఉంటేనే చేసే మనిషి ఆయన. నాన్నగారికి , చిరంజీవిగారికి, అల్లు అర్జున్ కి వాళ్ళ మార్కెట్ రెమ్యూనరేషన్ ఎంత ఉందో అంత డబ్బుని కూడా సినిమా రిలీజ్ కి ముందే ఇచ్చేస్తాం. మగధీర మూవీకి అనుకున్న దాని కంటే బడ్జెట్ ఎక్కువయ్యింది. కానీ అంతకు మూడు రేట్లు ఎక్కువగా డబ్బొచ్చింది. ఐతే తర్వాత చూడాలని ఉంది మూవీని హిందీలో కలకత్తా మెయిల్ అని తీశాను. ఫుల్ లాస్ వచ్చింది." అని చెప్పారు అల్లు అరవింద్.