English | Telugu
నిర్లక్ష్యం..బిగ్ బాస్ నియమాలంటే నిర్లక్ష్యం.. బిగ్ బాస్ టాస్క్ అంటే నిర్లక్ష్యం..!
Updated : Oct 19, 2022
మంగళవారం బిగ్ బాస్ చెప్పిన టాస్క్ లో ఏ కంటెస్టెంట్ కూడా సరిగ్గా పర్ఫామెన్స్ చేయకుండా నిర్లక్ష్యం చేయడంతో బిగ్ బాస్ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.
కంటెస్టెంట్స్ కి సెలబ్రిటీ లీగ్ టాస్క్ ను ఇచ్చాడు బిగ్ బాస్. కాగా ఏ కంటెస్టెంట్ కూడా సరిగ్గా పర్ఫామెన్స్ చేయలేకపోయారు. హౌస్ లో బజర్ మొదలైనప్పటి నుండి మళ్ళీ బజర్ వచ్చేంతవరకు టాస్క్ అనేది కొనసాగుతోంది అని అందరికి తెలిసిన విషయమే. అయితే ఎవరు కూడా ఈ సంగతి గుర్తుంచుకోకుండా కాసేపు వారికిచ్చిన సెలబ్రిటీ పాత్రలో ఉండి, తర్వాత మాములుగా ఉండిపోయారు. కొందరు బెడ్ రూంకి వెళ్ళి కబుర్లు చెప్పుకోగా, మరికొందరు కెమెరాల ముందుకు వెళ్ళి పర్ఫామెన్స్ చేసారు. దీంతో బిగ్ బాస్ కి కోపం వచ్చి, కంటెస్టెంట్స్ అందరిని గార్డెన్ ఏరియాకి రమ్మన్నాడు.
"మీరు అసలు ఏ టాస్క్ బాగా చేసారు. ఇప్పటిదాకా ఇచ్చిన టాస్క్ లు అన్నీ కూడా నిరాశజనకంగా సాగాయి. అందుకు కారణం నిర్లక్ష్యం. ఇంటి నియమాల పట్ల నిర్లక్ష్యం. బిగ్ బాస్ రూల్స్ పట్ల నిర్లక్ష్యం. బిగ్ బాస్ ని ఆత్రుతగా చూస్తోన్న ప్రేక్షకుల పట్ల నిర్లక్ష్యం. ఇలా మీ నిర్లక్ష్యం వల్ల బిగ్ బాస్ రూల్స్ ని ఉల్లంఘించి, అటు బిగ్ బాస్ ని, ఇటు ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయలేకపోగా, నిరాశకి గురి చేస్తోన్నారు" అంటూ కంటెస్టెంట్స్ ని నిలదీసాడు బిగ్ బాస్. కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ మాట్లాడుతూ, "మీకు అట మీద ఆసక్తి లేకపోతే హౌస్ ముఖద్వారం గుండా బయటకు పోండి" అని అనడంతో, అందరు ఒక్కసారిగా బిత్తరపోయారు.