English | Telugu

ప్రదీప్ కరెక్ట్ టైంకి పెళ్లి చేసుకుని ఉండి ఉంటే...

'లేడీస్ అండ్ జెంటిల్‌మెన్' ప్రతీ వారం ఎంటర్టైన్ చేస్తూ వస్తోంది. ఇప్పుడు కొత్త ప్రోమో రిలీజ్ అయ్యింది. చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈ ఎపిసోడ్ ని చాలా కలర్‌ఫుల్‌గా డిజైన్ చేశారు. ఈ ఎపిసోడ్ లో నటుడు అలీ రెజా తన కూతురు అమైరాతో, అలాగే యాంకర్ రవి తన కూతురు వియాతో కలిసి వచ్చారు. హోస్ట్ ప్రదీప్ ఈ పిల్లలిద్దరినీ ఎత్తుకుని ఫుల్ ఎంటర్టైన్ చేసాడు.

"హ్యాపీ చిల్డ్రన్స్ డే" అని ప్రదీప్ అమైరాకి విషెస్ చెప్తుంటే చెయ్యి వెనక్కి లాగేసుకుంది. "నువ్వు చిల్డ్రన్ ఏంట్రా.. అని అంది" అని చెప్పి ఫన్ చేసాడు.. "ప్రదీప్ కరెక్ట్ టైంకి పెళ్లి చేసుకుని ఉండి ఉంటే ఈ పిల్లలకే ఇంట్రడ్యూస్ చేయడానికి టైం సరిపోయేది కాదు." అని అలీ రెజా ప్రదీప్ మీద కౌంటర్ వేసాడు.

"ఇద్దరిలో నీ హోమ్ వర్క్ చేసేదెవరు?" అని వియాని ప్రదీప్ అడిగేసరికి వాళ్ళ అమ్మ చేస్తుందని చెప్పింది. "ఇంట్లో డ్రామా ఎవరు చేస్తారు అనేసరికి" వాళ్ళ నాన్న అని చెప్పింది. "ఐతే ఇంట్లో పనికొచ్చే పని ఒక్కటీ చేయడం లేదు.. పెద్ద ఓవర్ యాక్షన్ కాండిడేట్ అన్నమాట నువ్వు" అని రవి మీద సెటైర్ వేసాడు ప్రదీప్.

"ఇద్దరిలో ఎవరు అందంగా ఉంటారు?" అని ప్రదీప్ అడిగితే, "అమ్మ అందంగా ఉంటుంది.. నాన్న హ్యాండ్సమ్ గా ఉంటాడు" అని ఎవరినీ హర్ట్ చేయకుండా ఆన్సర్ చేసింది వియా. ఇక పిల్లలిద్దరికీ బొమ్మలు, చాక్లేట్లు ఇచ్చి వాళ్ళతో డాన్స్ లు చేసాడు ప్రదీప్.