English | Telugu
పల్లవి ప్రశాంత్ కి అఖిల్ సార్థక్ సపోర్ట్.. అమర్ దీప్ పై మొదలైన ట్రోల్స్!
Updated : Sep 27, 2023
రోజురోజుకి పల్లవి ప్రశాంత్ క్రేజ్ చూస్తుంటే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఇతనే అయ్యేలా కన్పిస్తున్నాడు. బిగ్ బాస్ సీజన్-7 గ్రాంఢ్ గా మొదలైన సంగతి తెలిసిందే. రైతు బిడ్డగా చేతిలో బియ్యపు బస్తాతో గ్రాంఢ్ గా ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ కి సెలబ్రిటీల సపోర్ట్ రోజు రోజుకి పెరుగుతుంది. రైతు ఎక్కడున్నా రాజే అంటూ సామాన్యులు బ్రహ్మరథం పడుతున్నారు.
పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ చేస్తూ అఖిల్ సార్థక్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ లు చేస్తున్నాడు. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ కి వెళ్ళేముందు ఉన్న ఫాలోయింగ్ కంటే ఇప్పుడు అతడి ఫాలోయింగ్ రెట్టింపు అయింది. అఖిల్ సార్థక్ తన ఇన్ స్టాగ్రామ్ లో పల్లవి ప్రశాంత్ వ్యాలిడ్ పాయింట్ మాట్లాడంటూ పోస్ట్ చేశాడు. నిన్న జరిగిన నామినేషన్లలో పల్లవి ప్రశాంత్, శుభశ్రీలని అమర్ దీప్ నామినేట్ చేశాడు. ఇక రీజన్ లు చెప్తూ.. నువ్వు మాస్క్ వేసుకున్నావ్ అని అమర్ దీప్ అన్నాడు. " ప్రతీ ఒక్కరికి పరిస్థితులు వేరుగా ఉన్నప్పుడు భిన్నమైన ఎమోషన్స్ వస్తాయి. ఎప్పుడు ఒకే ఎమోషన్ తో ఉండటానికి ఇది సీరియల్ లో క్యారెక్టర్ కాదు. మనం మనుషులం, డబుల్ ఫేస్ అని అనడం తప్పు. ఇది ప్రతీసారి చెప్తున్న అమర్ దీప్ కి డబుల్ ఫేస్ ఉంది. పల్లవి ప్రశాంత్ ఈజ్ ఆన్ పాయింట్" అంటూ అఖిల్ సార్థక్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.
అఖిల్ సార్థక్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు స్పష్టంగా తెలిసిందేంటంటే.. అమర్ దీప్ బిహేవియర్ కంప్లీట్ గా రాంగ్ అని, అతడు తోటి కంటెస్టెంట్ అయిన పల్లవి ప్రశాంత్ అరేయ్ , ఒరేయ్ అని అనడం ఎంత వరకు కరెక్ట్. అలా తక్కువ చేసి మాట్లాడితే పల్లవి ప్రశాంత్ స్థానంలో ఏ కంటెస్టెంట్ ఉన్న అసలు తీసుకోలేరు. పెద్ద గొడవ జరుగుతుంది. ఇలా ఎదురు తిరిగి మాట్లాడడనే కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ పై ఫైర్ అయ్యాడని తెలుస్తుంది. దీంతో అమర్ దీప్ సీరియల్ బ్యాచ్ కే సపోర్ట్ అని, ప్రియాంక జైన్, శోభా శెట్టిలతో కలిసి గ్రూప్ గా ఆడుతున్నాడని తెలుస్తుంది.