English | Telugu
ముగిసిన ఇండియన్ ఐడల్ సీజన్ 4.. విన్నర్ గా లేడీ రాక్ స్టార్ బృందా
Updated : Nov 2, 2025
ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 ఫైనల్స్ కి వచ్చేసింది. ఫైనలిస్టులందరినీ స్టేజి మీదకు పిలిచారు. బృందా, సృష్టి చిల్ల, పవన్ కళ్యాణ్, ధీరజ్, స్నిగ్ధ, కూర్మ సహస్ర వీళ్లంతా అదిరిపోయే కాస్ట్యూమ్స్ తో మంచి సాంగ్స్ పాడి అందరినీ అలరించారు.
ఐతే ఈ ఆరుగురిలో టాప్ 3 లోకి పవన్ కళ్యాణ్, బృంద, ధీరజ్ ఎంపికయ్యారు. ఫైనల్ సాంగ్ గా బాయ్స్ మూవీ నుంచి "సరిగమే పదనిసే" అనే చరణాన్ని ముగ్గురూ పాడి జడ్జెస్ నుంచి మంచి కాంప్లిమెంట్స్ అందుకున్నారు.
ఇక విన్నర్స్ ని అనౌన్స్ చేశారు. ఫస్ట్ రన్నరప్ గా పవన్ కళ్యాణ్ ని సెలక్ట్ చేశారు. అతనికి 5 లక్షల కాష్ ప్రైజ్ ఇచ్చారు. ఇక ఈ సీజన్ ట్రోఫీని బృందా గెలుచుకుంది. ఆహా సి.ఈ.ఓ, థమన్, కార్తీక్ వచ్చి ట్రోఫీ ఇచ్చి 10 లక్షల కాష్ ప్రైజ్ ని అందించారు. ఇక ఈ సీజన్ ఇలా ముగిసిపోయింది.
సీజన్ ఎప్పుడు స్టార్ట్ అయ్యిందో ఎప్పుడు ఎండ్ అయ్యిందో కూడా తెలీనట్టుగా ఈ సీజన్ ముగిసిపోయింది. ఇక ఈ సీజన్ లో చాలామంది కంటెస్టెంట్స్ కి థమన్, కార్తిక్ కలిసి సినిమాల్లో పాడే అవకాశాలు అలాగే కన్సర్ట్స్ కి కూడా షో స్టాపర్స్ గా ఉండే ఛాన్స్ లు ఇచ్చారు.