English | Telugu

Brahmamudi:ఆ నాటకానికి ఒప్పుకున్న కావ్య.. సర్ ప్రైజ్ ఏంటో రాజ్ కనిపెట్టగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -333 లో.. కావ్య తన పుట్టింటికి వచ్చి తన బాధని వెళ్ళి బుచ్చుకుంటుంది. ఇక నేను ఆయనతో విడిపోవాలి అనుకుంటున్నానని కావ్య తన అమ్మనాన్నలకి చెప్తుంది. విడిపోయి తప్పు చేస్తావా అని ఇందిరాదేవి అంటుంది. ఇందిరాదేవి రావడం చూసి అందరు షాక్ అవుతారు. భర్త ఆదరణ కరువు అయిందని తన జీవితం నుండి తప్పుకుంటానని అనడం కరెక్ట్ కాదని ఇందిరాదేవి అంటుంది.

నాకు అంతా తెలుసు.. నా స్నేహితురాలి కథ అంటు నీ కథ చెప్పినప్పుడే నాకు అర్థం అయింది. నీ గురించి చెప్తున్నావ్. కానీ రాజ్ కి నువ్వు అంటే ఇష్టం ఉంది.. అది అతను ఒప్పుకోవడానికి మగ అహంకారం అడ్డువస్తుంది అంతే.. నిన్ను ఇంట్లో అందరు అవమానిస్తుంటే నీకు సపోర్ట్ గా ఉన్నాడు కదా.. నువ్వు తినకుండా పడుకుంటే తను భోజనం దగ్గర నుండి లేచి వెళ్ళిపోయి నీకు అన్నం తెచ్చి ఇవ్వలేదా.. ఇది కదా ప్రేమంటే.. వాడు ఒక అమ్మాయిని అడ్డు పెట్టుకొని నీకు దూరం కావాలని అనుకుంటున్నాడు. నువ్వు కూడా ఒక అబ్బాయిని అడ్డు పెట్టుకొని వాడిలో నీపై ఉన్న ప్రేమని బయటకు తియ్యమని ఇందిరాదేవి అనగానే కావ్య షాక్ అవుతుంది. నేనేంటి ఒక అబ్బాయితో క్లోజ్ గా ఉండడమేంటని.. ఏంటి నా వల్ల కాదు. అది ఇంట్లో వాళ్ళందరు అపార్థం చేసుకుని నింద వేస్తారని కావ్య అనగానే.. అంత వరకు వస్తే దీనికి కారణం నేనే.. ఈ ప్లాన్ చేసింది నేనే అని వాళ్ళకి చెప్తాను. నువ్వు దీనికి ఒప్పుకోమని కావ్యని ఇందిరాదేవి ఒప్పిస్తుంది. నా అక్క కొడుకు ఊరు నుండి వస్తున్నాడు. వాడిని ఈ సాయం చెయ్యమంటే చేస్తాడని కృష్ణమూర్తి అంటాడు. ఇంకేంటి వరుసకి బావ అవుతాడని ఇందిరాదేవి అంటుంది. దాంతో కావ్య కూడా ఒప్పుకుంటుంది.

ఆ తర్వాత కావ్య, ఇందిరాదేవిలు ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. కావ్య రాగానే గొడవ చెయ్యడానికి ధాన్యలక్ష్మి రెడీగా ఉంటుంది. డబ్బులు దొంగతనం చేసి మీ పుట్టింట్లో ఇచ్చేసి వచ్చావా అని రుద్రాణి అంటుంది. అసలేం జరిగిందని ఇందిరాదేవి అడుగుతుంది. లాకర్ కీస్ ఇచ్చిన రోజే ఈ కావ్య రెండు లక్షలు దొంగతనం చేసి వాళ్ళ పుట్టింట్లో ఇచ్చిందని ధాన్యలక్ష్మి అనగానే.. నిజమేనా అపర్ణ అని ఇందిరాదేవి అడుగుతుంది. అదంతా తెలియదు కానీ రెండు లక్షలు లేవు.. తీసుకుంటే తీసుకున్నావ్ చెప్పాలి కదా అందరికి మాట్లాడే అవకాశం ఇస్తున్నావని అపర్ణ అంటుంది. అప్పుడే స్వప్న వచ్చి అందరు మా చెల్లినే దొంగ అంటున్నారేంటి? మా చెల్లె నాకు డబ్బులు ఇచ్చిందని అనగానే అందరు షాక్ అవుతారు. తరువాయి భాగంలో రాజ్ తో కావ్య.. రేపు మీకు ఒక సర్ ప్రైజ్ ఉందని చేప్తుంది. దాంతో రాజ్ ఏంటి అది అని ఆలోచిస్తూ కావ్యని నిద్రపోనివ్వడు.. తను నిద్రపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.