English | Telugu

అన్నా నీదెంత మంచి మనసో.. ఆ దేవుడు మీకు మంచే చేస్తాడు

అద్భుతమైన స్టెప్స్ తో, డాన్స్ మూవ్మెంట్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆట సందీప్. బిగ్‌ బాస్‌ సీజన్ 7 లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. హౌస్ లో తన డాన్స్ తో అందరినీ ఎంటర్టైన్ చేసాడు. గేమ్స్‌, టాస్కులు బాగా ఆడాడు. అయినప్పటికీ కొన్ని వారాలకే ఎలిమినేట్ అయ్యాడు. సందీప్‌ మాస్టర్ "లవ్‌ యూ టూ" అనే మూవీలో హీరోగా నటించాడు. తాజాగా "ది షార్ట్‌ కట్‌" పేరుతో ఒక మూవీ చేశాడు. విజయానికి అడ్డ దారులుండవు అనేది ఆ మూవీ క్యాప్షన్.

ఇక సందీప్ తన సంక్రాంతిని స్పెషల్ గా చేసుకున్నాడు. సర్వ్ నీడి అనే సంస్థతో కలిసి కొంతమందికి ఫుడ్ డొనేట్ చేసాడు. డొనేట్ చేయడం మాత్రమే కాదు దగ్గర ఉండి చూసుకున్నాడు. "ఇలాంటి మంచి పనులు చేస్తూ మీరు మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను అన్న.. మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయడం నేను చాలా చూశాను కోవిడ్ టైంలో మీరు చాలామందికి ఆకలి తీర్చారు... ధైర్యాన్ని ఇచ్చారు, బలంగా నిలబడ్డారు.. మీరు ఇలాంటివి మరిన్ని చేయాలని దానికి ఆ దేవుడు మీకు పూర్తిగా సహకరించాలని కోరుకుంటున్నాను...బిగ్ బాస్ లో చూసి నువ్వు చాలా బాడ్ బాయ్ అనుకున్నా కానీ...రియల్ లైఫ్ లో నువ్వు వెరీనైస్...మీరు ఇలాంటి మంచి పనులు చేయాలి.. ఆ దేవుడు మీకు అంతా మంచే చేస్తాడు." అంటూ నెటిజన్స్ సందీప్ చేసిన మంచి పనికి హ్యాపీగా ఫీలవుతున్నారు. సందీప్ వైఫ్ జ్యోతి రీసెంట్ గా కొంతమంది పేదలకి దుప్పట్లు కూడా పంపిణీ చేసింది. బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక సందీప్ తన కో-కంటెస్టెంట్స్ అందరినీ కలిసాడు.