English | Telugu

Brahmamudi: అతని దగ్గర మాట తీసుకున్న అనామిక.. కావ్య ఏం చేయనుంది?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -305 లో.. కళ్యాణ్ పూజ మధ్యలో వదిలేసి వచ్చి మరీ అప్పుకి బ్లడ్ ఇచ్చి సేవ్ చేస్తాడు. దాంతో కనకం కృష్ణమూర్తి ఇద్దరు తనకి థాంక్స్ చెప్తారు. నా ఫ్రెండ్ ని కాపాడుకోవడం నా బాధ్యత అని కళ్యాణ్ చెప్తాడు. ఆ తర్వాత కావ్య, కళ్యాణ్ ఇద్దరు ఇంటికి బయలుదేరి వెళ్తారు.

ఇంటికి వెళ్లడంతో ధాన్యలక్ష్మి, అనామిక ఇద్దరు కావ్య వంక కోపంగా చూస్తుంటారు. కావ్య లోపలికి రావడంతో ఇందిరాదేవి అప్పు గురించి అడిగి తెలుసుకుంటుంది. కళ్యాణ్ వచ్చి సేవ్ చేసాడని కావ్య చెప్తుంది. కోపంగా ఉన్న అనామిక దగ్గరికి కావ్య వచ్చి.. తన వల్ల పూజ ఆగిపోయిందని సారీ చెప్తుంది.. దాంతో ధాన్యలక్ష్మి మధ్యలో కలుగుజేసుకొని కావ్య కావాలనే ఇదంతా చేసింది అన్నట్లుగా మాట్లాడుతుంది. కానీ అనామిక అందరి ముందు కళ్యాణ్ మంచి పని చేసాడంటూ మెచ్చుకుంటుంది. ఆ తర్వాత ఈ గొడవ అంతా మర్చిపోయి రాత్రికి జరగబోయే శోభనానికి ఏర్పాటు చెయ్యండని ఇందిరాదేవి చెప్తుంది.

కనకానికి స్వప్న ఫోన్ చేసి.. మీరు కావ్యని పిలవడం వల్ల అందరు కావ్య వల్లే పూజ ఆగిపోయిందంటు తిడుతున్నారు. బాగా అవసరం అయితేనే కావ్యకి ఫోన్ చెయ్యండని కనకానికి స్వప్న చెప్తుంది. ఆ తర్వాత మనం అనుకున్నట్టుగానే జరిగిందని కనకం, కృష్ణమూర్తి ఇద్దరు బాధపడుతారు. ఆ తర్వాత డాక్టర్ వాళ్లని పిలిచి అప్పుకి ఇప్పుడు పర్వాలేదు. బిల్ కట్టి తీసుకొని వెళ్ళండని చెప్తుంది. మరొకవైపు అనామిక గదిలోకి వచ్చి కళ్యాణ్ పై కోపంగా ఉంటుంది. దాంతో కళ్యాణ్ వచ్చి సారీ చెప్తాడు. ఇంకెప్పుడు అయినా సరే నువ్వు నాకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వాలి.. అలా అని మాట ఇవ్వమని అనామిక మాట తీసుకుంటుంది. దాంతో చేసేదేమీ లేక కళ్యాణ్ కూడా మాట ఇస్తాడు. మరొకవైపు హాస్పిటల్ బిల్ చూసి కనకం, కృష్ణమూర్తి షాక్ అవుతారు. ఇంత డబ్బు ఎక్కడ నుండి తీసుకొని వస్తామని బాధపడుతారు.

మరొకవైపు కావ్య రావడంతోనే రాజ్ మళ్ళీ చేస్తానంటూ ఫోన్ కట్ చెయ్యగానే కావ్య వచ్చి రాజ్ తో గొడవ పెట్టుకుంటుంది. మరొకవైపు కనకం, కృష్ణమూర్తి ఇద్దరు అప్పు దగ్గరికి వెళ్లి.. కళ్యాణ్ బ్లడ్ ఇచ్చిన విషయం చెప్తాడు. మన బాధలు మనం పడుదాం కానీ వాళ్ళకి చెప్పొద్దని అప్పు అంటుంది. ఆ తర్వాత రాజ్ బిల్ పే చేసాడు. మీరు వెళ్ళండని నర్సు వచ్చి చెప్పడంతో కనకం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. తరువాయి భాగంలో నా కొడుకు, కోడలు శోభనానికి సంబంధించిన ఏర్పాట్లు నువ్వు చెయ్యనని నాకు మాటివ్వని కావ్యతో ధాన్యలక్ష్మి మాట తీసుకుంటుంది. మరొకవైపు ఏంటి అన్ని పనులు చేసేదానికి శోభనానికి సంబంధించిన ఏర్పాటు చెయ్యడం లేదని కావ్యని రాజ్ అడుగుతాడు. అప్పుడే వచ్చిన అనామిక విని ఈ కావ్యకి నాపై ఎప్పుడు కోపం పోతుందో అని రాజ్ తో అంటుంది. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.