English | Telugu

Guppedantha Manasu : ఆ గదిలో చూసి‌ షాకైన శైలేంద్ర.. సూపర్ ట్విస్ట్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -972 లో... మహేంద్ర దగ్గరికి భద్ర వచ్చి నేను జాబ్ మానేస్తాను.. నాకేం వర్క్ చెప్పడం లేదు మేడమ్ కి సెక్యూరిటి అన్నారు, మేడమ్ కూడ ఇక్కడ లేరని భద్ర అంటాడు. మేడమ్ ని రమ్మని చెప్పండి అని భద్ర అనగానే.. సరే నేను వసుధారతో మాట్లాడి చెప్తాను. నువ్వు ఏం పని చెప్పడం లేదు అంటున్నావ్ కదా బండిలో డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయించమని భద్రని మహేంద్ర పంపిస్తాడు.

మరొకవైపు రిషి ఎక్కడ ఉన్నాడని శైలేంద్ర ఆలోచిస్తుంటాడు. ఆ వసుధార రిషిని వాళ్ళ ఇంట్లోనే ఉంచి నా మనుషులకు కనిపించకుండా దాచి ఉంచిందేమోనని శైలేంద్ర అనుకుంటాడు. అప్పుడే అటుగా వెళ్తున్న ధరణిని చూసి.. నాకు ఇలాంటి టైమ్ లో ధరణినే ఉపయోగపడుతుందని భావిస్తాడు. కావాలనే ధరణికి వినపడేలా రిషి దొరికాడా? వాన్ని వదలొద్దు అంటూ ఫోన్ మాట్లాడినట్టు యాక్టింగ్ చేస్తాడు. దాంతో ధరణి నిజంగానే శైలేంద్రకి రిషి ఎక్కడ ఉన్నాడో తెలిసింది అనుకొని రిషిని కాపాడుకోవాలని అనుకుంటుంది. మరొకవైపు అనుపమ, మహేంద్ర ఇద్దరు కలిసి భద్ర గురించి మాట్లాడుకుంటారు. నాకు ఎందుకో భద్ర శైలేంద్ర మనిషే అని ప్లాన్ ప్రకారం మన దగ్గరికి వచ్చినట్టు తెలుస్తుందని అనుపమ అనగానే.. నాకు డౌట్ గానే ఉంది.. వసుధార దగ్గరికి ఎందుకు వెళ్ళాడని ఇంకా అర్ధం కావడం లేదని మహేంద్ర అంటాడు. వాడిని జాబ్ లోనే ఉంచితే వాడి ప్రతి మూమెంట్ అబ్సర్వ్ చెయ్యొచ్చని అనుపమ అంటుంది. అప్పుడే భద్ర వచ్చి డబ్బులు ఇవ్వలేదని అనగానే మహేంద్ర డబ్బులు ఇస్తాడు. మరొకవైపు వసుధారకి‌ ధరణి ఫోన్ చేసి రిషి ఎక్కడ ఉన్నాడు? మా అయనకి దొరికాడంట.. ఇప్పుడే ఫోన్ లో మాట్లాడుతుంటే విన్నానని ధరణి అనగానే.. వసుధారకి మాత్రం శైలెంద్ర ఇదేదో ప్లాన్ చేసినట్లే ఉన్నాడని అర్థం అవుతుంది. అప్పుడే ధరణి ఫోన్ శైలేంద్ర లాక్కొని వసుధార మాటలు వింటాడు. నువ్వు రిషి సర్ గురించి టెన్షన్ పడకు నేను ఉన్నంత వరకు రిషి సర్ ని ఎవరేం చెయ్యలేరని వసుధార అంటుంది. వెంటనే ధరణి శైలెంద్ర దగ్గర ఉన్న తన ఫోన్ లాక్కొని కట్ చేస్తుంది.

ఆ తర్వాత ఫోన్ కట్ చేసాక ధరణిని శైలేంద్ర తిడుతాడు. రిషి వచ్చాక మీ సంగతి చెప్తాడని ధరణి అంటుంది. కాసేపటికి వసుధార వాళ్ళు ఉన్న ఇంట్లో రిషి ఉన్నాడేమో చూడడానికి శైలేంద్ర గోడ దూకి వెళ్తాడు. అప్పుడే వసుధార చూసి శైలేంద్రని తిడుతుంది. మరొకవైపు మహేంద్రకి ధరణి ఫోన్ చేసి జరిగింది చెప్తుంది. అదే సమయంలో రిషి కోసం శైలేంద్ర లోపలికి వెళ్తుంటే వసుధార అడ్డుపడుతుంది. అయిన శైలేంద్ర వినడు. వసుధారకి‌ మహేంద్ర ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యదు. శైలేంద్ర గది లోపల చూసి షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.