English | Telugu

హౌస్ లో డిజర్వింగ్ ఆ నలుగురు.. అంబటి అర్జున్ ఫేక్ అంట!

బిగ్ బాస్ సీజన్-7 లో ఎలిమినేషన్, నామినేషన్ అంటూ ప్రతీ ఎపిసోడ్ హీటెక్కిపోతుంది‌. ఎనిమిదవ వారం ఆట సందీప్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక హౌస్ అంత షాక్ లో ఉండిపోయిన విషయం తెలిసిందే. అయితే ఎలిమినేషన్ తర్వాత ఎగ్జిట్ ఇంటర్వ్యూ ఉంటుంది కదా.. మరి ఆ ఎగ్జిట్ ఇంటర్వ్యూ లో గీతు రాయల్ అడిగిన ప్రశ్నలికి ఆట సందీప్ ఆసక్తికరమైన సమాధానాలు చెప్పాడు.

సందీప్ మాస్టర్ ఇంత ఫాస్ట్ గా బయటకు వస్తారని అనుకున్నారా అని గీతు రాయల్ అడుగగా.. ఫాస్టా? ఆరవై రోజులు ఉన్నానని ఆట సందీప్ అన్నాడు. మీ మాస్ పెళ్ళాం మాస్ డ్యాన్స్ తో ఎదురొస్తానని గీతు అనగా.. నా మాస్ పెళ్ళాం మాస్ డ్యాన్స్ చాలాసార్లు చూశానని ఆట సందీప్ అన్నాడు. బిగ్ బాస్ చరిత్రలోనే రెండు రికార్డులు క్రియేట్ చేశారు. ఫస్ట్ ది ఏడు వారాలు నామినేట్ అవ్వకుండా హౌస్ లో ఉన్నారు. రెండవది సంచాలకుడిగా అన్ని తప్పులు చేయడమని గీతు అనగా.. హౌస్ లోని వాళ్ళవి తప్పులు కానప్పుడు నాది ఎందుకు తప్పు అవుతుందని ఆట సందీప్ అన్నాడు. ఇక మీకన్నా హౌస్ లో ఎవరైన అన్ డిజర్వింగ్ వాళ్ళు ఉన్నారని మీరు అనుకుంటున్నారా? అని గీతు అడుగగా.. నేను హీరో అని అనుకుంటాడు కానీ అతము హీరో కాదు జీరో అంటు అక్కడ ఉన్న బెలూన్ ని పగులగొట్టాడు ఆట సందీప్.

రతిక.. ఈజ్ బ్లాక్. అంబటి అర్జున్.. బుద్ధి బలం, కండ బలం అన్నీ నాకే ఉన్నాయని అనుకుంటాడు కానీ అంత సీన్ లేదక్కడ, అదంతా ఫేక్. శివన్న.. ప్రశాంత్ , యావర్ ని కెప్టెన్ ని చేశాననే అపోహలో ఉంటాడు. ఇక హౌస్ మొత్తంలో‌‌.. అమర్ దీప్, శోభాశెట్టి, ప్రియాంక, పల్లవి ప్రశాంత్ డిజర్వింగ్ అని చెప్పాడు ఆట సందీప్. ఇఒ హౌస్ మొత్తంలో పాజిటివిటి ఎక్కువ ఉంది ప్రియాంకకే అని ఆట సందీప్ అన్నాడు.