English | Telugu

ఆట సందీప్ ‘ఆట’ ముగిసింది.. ఎందుకో తెలుసా?

బిగ్ బాస్ సీజన్-7 ఎన్నడు లేని విధంగా ఉత్కంఠభరితంగా సాగుతుంది. ప్రతీ వారం సస్పెన్స్ ట్విస్ట్ లతో ఒక థ్రిల్లర్ సినిమాని చూపిస్తున్నాడు బిగ్ బాస్. నిన్న మొన్నటి వరకు డబుల్ ఎలిమినేషన్ అని అనగా.. ఇప్పుడు సింగిల్ ఎలిమినేషన్ చేశాడు.

ఆదివారం నాటి ఎపిసోడ్‌లో మొదటగా కంటెస్టెంట్స్ ఆట, పాటలతో ఎంటర్టైన్మెంట్ చేపించాడు నాగార్జున. మధ్యల మధ్యలో నామినేషన్లో ఉన్న ఒక్కొక్కరిని నాగార్జున సేవ్ చేసుకుంటు వచ్చాడు. నామినేషన్లో చివరగా భోలే షావలి, శోభాశెట్టి, ఆట సందీప్ ముగ్గురు ఉండగా.. భోలే షావలి సేవ్ అయ్యాడు. ఇక ఆట సందీప్, శోభాశెట్టి నామినేషన్లో ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళిద్దరిని యాక్టివిటి ఏరియాకి వెళ్లమని, కంటెస్టెంట్స్ ని హాల్ లోకి వెళ్ళమని నాగార్జున చెప్పాడు.

ఇక యాక్టివిటి ఏరియాలోకి వెళ్ళిన శోభాశెట్టి, ఆట సందీప్ లకి బ్లడ్ తీసే పైప్ ఉంచి వారి ' హార్ట్ బీట్' స్క్రీన్ మీద కనపడుతుందని చెప్పాడు. ఇక కౌంట్ డౌన్ ముగిసే సమయానికి ఆట సందీప్ హార్ట్ బీట్ ఆగింది. శోభాశెట్టిహార్ట్ బీట్ రన్ అవుతుంది. దాంతో శోభాశెట్టి సేఫ్, ఆట సందీప్ ఎలిమినేటెడ్ అని నాగార్జున అన్నాడు. ఇక హౌస్ అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక హౌస్ లోని వాళ్ళకి ఒక్కొక్కరికి బై చెప్పేసి బయటకు వచ్చాడు.