English | Telugu

వాడి వల్ల చాలా మోసపోయాను.. నాన్న లేకపోతే ఇంతే!

రీతూ చౌదరి.. ప్రస్తుతం మంచి క్రేజ్‌ ఉన్న నటి. రీతూ తన కెరీర్‌ని ఒక మ్యూజిక్‌ ఛానెల్‌లో యాంకర్‌గా మొదలు పెట్టింది. అంతేకాకుండా యాంకర్‌ ప్రదీప్‌ హోస్ట్‌గా చేసిన పెళ్లి చూపులు షోకి వచ్చి మంచి ఫేమ్‌ని సంపాదించుకుంది. ప్రస్తుతం రీతూ జబర్దస్త్‌లో చేస్తోంది. అంతేకాకుండా ‘ఇంటిగుట్టు’ సీరియల్‌లో నెగెటివ్‌ రోల్‌లో యాక్టింగ్‌ చేసి అందరినీ మెప్పించింది. అప్పట్లో యాంకర్‌ విష్ణుప్రియ, రీతూ కలిసి బ్యాంకాక్‌ బీచ్‌లో సందడి చేసిన ఫోటోస్‌ వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

రీతూ చౌదరి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత తనకి విపరీతమైన సింపతీ లభించింది. ఆ తర్వాత పలు అవకాశాలు కూడా వచ్చాయి. అయితే ఒకవైపు ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో, మరొక వైపు జబర్దస్త్‌ షోలో నటిస్తూ బిజీగా ఉంటోంది రీతూ. అయితే తను సొంతంగా ఒక యూట్యూబ్‌ ఛానెల్‌ని కూడా స్టార్ట్‌ చేసింది. ఫోటో షూట్‌లతో ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండిరగ్‌లో ఉంటూ, ఎప్పుడూ తన అభిమానులకు దగ్గరగా ఉంటోంది.

రీతు చౌదరిని ఒకడు మోసం చేశాడంటూ తన యూట్యూబ్‌ ఛానెల్‌లో ఒక వీడియోని అప్‌లోడ్‌ చేసింది. రీతూ వాళ్ళ నాన్న చనిపోయాక ఒక ఇల్లు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఇంటికి మంచి డిజైన్‌ కోసం ఒక డిజైనర్‌ ని ఆశ్రయిస్తే వాడు అడ్వాన్స్‌ తీసుకొని పని సరిగ్గా చేయలేదంట. పని రాకపోతే రాదని చెప్పాలి ఇలా వచ్చీ రాని పనితో, సగం సగం డిజైన్స్‌ వేసి ఇల్లంతా పాడు చేస్తారా అంటూ రీతూ చెప్పింది. ఇక మాకొద్దని వాడికి ఫోన్‌ చేసినా, మెసెజ్‌ లు చేసిన స్పందించలేదంట.. దాంతో పోలీసులని ఆశ్రయించింది రీతు. ఆ తర్వాత ఆ డబ్బులని తిరిగిఇచ్చాడని అంది. మా నాన్న చనిపోయాక ఈ ఇంటికి వచ్చాను. ఎవరికైనా నాన్న లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది. నాన్న ఉండి ఉంటే ఇలా మోసం చేసేవారు కాదని రీతూ ఈ వ్లాగ్‌లో చెప్పుకొచ్చింది. కాగా, ఇప్పుడు ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.