English | Telugu
సూర్యలో చాలా ఆకలి ఉంది.. అది హౌస్‌లో బాగా కనిపిస్తోంది!
Updated : Oct 25, 2022
బిగ్ బాస్ హౌస్ దీపావళి సందడితో ఫుల్ జోష్ గా మారింది. హీరోయిన్ల డాన్స్ లతో, టాప్ గెస్ట్ లతో కలర్ ఫుల్ గా ఎంటర్టైన్ చేసింది. ఇక ఈ వీకెండ్ ని మరింత జోష్ గా చేయడానికి బుల్లి తెర స్టార్ కమెడియన్ హైపర్ ఆదిని తీసుకువచ్చారు టీమ్. ఇక ఆది హౌస్ మేట్స్ ను తన ప్రాసలు, పంచులతో ఒక రేంజ్ లో ఆడేసుకున్నాడు వచ్చి రావడంతోనే శ్రీహాన్- ఇనయా , శ్రీహన్ - ఆర్జే సూర్య మధ్య రహస్య సంబంధాలను బయట పెట్టేసాడు. ఏ టాపిక్ మాట్లాడినా గీతూ అందులోకి దూరిపోతుంది కాబట్టి ఆమె నుంచే తన డైలాగ్ డెలివరీ స్టార్ట్ చేసాడు.
"మా పరివార్ అవార్డ్స్" లాగా "మధ్యలో దూరే అవార్డ్ " లాంటిది ఉంటే అది గీతూకే వస్తుంది అన్నాడు. "మైండ్ గేమ్ ఆడకుండా అప్పుడప్పుడు కాస్త ఫిజికల్ గా ఆడరా" అంటూ సలహా ఇచ్చాడు. ఇక అర్జున్ గురించి మాట్లాడుతూ " టిప్పులిచ్చి మరీ జైలుకెళ్లడమే కాదు భారతంలో అర్జునుడు ఎలా గురి పెట్టి పిట్టను కొట్టాడో అంతకంటే ఎక్కువగా శ్రీసత్యాను పట్టడానికి కష్టపడుతున్నావ్" అంటూ కౌంటర్ వేసాడు హైపర్ ఆది. అటు శ్రీసత్య ను ఉద్ధేశించి హాట్ కామెంట్స్ చేశాడు. బిగ్ బాస్ లో శ్రీసత్యను చూడడానికే కుర్రాళ్లు టీవీల ముందు కూర్చుంటున్నారు అన్నాడు. ఇక హౌస్ లో జరుగుతున్న లవ్ స్టోరీల గురించి తనదైన స్టయిల్లో పంచులు వేసాడు ఆది. బిగ్ బాస్ కనుక డైరెక్టర్ సుకుమార్ చూస్తే.."ఆర్య వన్ సైడ్ లవ్ లాగా సూర్య ఆల్ సైడ్ లైవ్ సినిమా కచ్చితంగా చేస్తాడంటూ" నాన్ స్టాప్ గా ఇచ్చి పడేశాడు ఆది.
"సూర్య ఎక్కడుంటే అక్కడ ఏదో ఉండనే అనుకుంటున్నారు. సూర్య వరల్డ్ ఫేమస్ లవర్ ఐపోయాడు. అంతే కాదు ఈ లవ్ స్టోరీలు అవి.. కమల్ హాసన్ గారు చేసేసారు కాని.. అదే ఇలాంటి టైములో నువ్వు బయటకు వస్తేనా ఆకలి రాజ్యం సినిమా నీతో చేయడానికి రెడీగా ఉన్నారు డైరెక్టర్లు అంత ఆకలి ఉంది నీలో" అంటూ సూర్యను ఉద్దేశించి అన్నాడు. "ఇవన్నీ తెలిస్తే బుజ్జమ్మ ఏముంటది సూర్య" అని నాగ్ అడిగేసరికి "నరికేస్తాది సర్" అంటూ సూర్య ఆన్సర్ ఇచ్చాడు.