English | Telugu
అమ్మల సెల్ పాస్వర్డ్స్ తెలుసుకుంటారు కానీ వాళ్ళవి చెప్పరు!
Updated : Oct 24, 2022
చెఫ్ మంత్ర సీజన్ 2 ఎన్నో టాస్క్స్ తో అలాగే డెలీషియస్ ఫుడ్ ప్రిపరేషన్స్ తో ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. మంచు లక్ష్మి హోస్ట్ గా చేస్తున్న ఈ షోకి ప్రతీ వారం కొంతమంది సెలెబ్రిటీ గెస్ట్స్ వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఇక ఈ వారం రీతూ వర్మ, వాళ్ళ అమ్మ సంగీత చెఫ్ మంత్ర సీజన్ 2 లోకి ఎంట్రీ ఇచ్చారు.
ఇక ఈ ఎపిసోడ్ లో "కరెక్ట్ ఆన్సర్ చెప్పండి స్వీట్ తినండి" అనే టాస్క్ ఇచ్చింది మంచు లక్ష్మి. "ఆంటీ రీతుకి 10th క్లాస్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి" అని అడిగింది. "95 పర్సెంట్ తెచ్చుకుంది. స్కూల్ టాపర్ గా నిలిచింది " అని చెప్పింది సంగీత. తర్వాత "మీ అమ్మతో కలిసి చూసిన ఫస్ట్ మూవీ ఏమిటి" అని రీతూను అడిగింది. " ఏదో గుర్తులేదు కానీ అమ్మతో కలిసి జుమాంజి, జురాసిక్ పార్క్, ఇండిపెండెన్స్ డే చూసాను..ఆ మూవీస్ చూసేటప్పుడు నేను యాక్టర్ ఐతే బాగుండు అనుకునేదాన్ని ఈరోజు యాక్టర్ ని అయ్యాను" అని చెప్పింది రీతూ.
" ఆంటీ రీతూ ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది ఫాలోవర్స్ వున్నారు" అని అడిగింది లక్ష్మి "20 లాక్స్ ఫాలోవర్స్ ఉన్నారు" అని కరెక్ట్ ఆన్సర్ చేసింది. "రీతూ మీ అమ్మకు ఏ వయసులో పెళ్లి అయ్యింది" అని అడిగింది. కానీ రీతూ ఆన్సర్ తప్పు చెప్పేసరికి వాళ్ళ అమ్మ కరెక్ట్ చేసింది "24 ఏళ్ళ వయసులో పెళ్లి అయ్యిందని " చెప్పింది.
"ఆంటీ పెళ్లి చూపులు మూవీలో రీతూ క్యారెక్టర్ ఏమిటి" అని అడిగేసరికి "చిత్ర" అని కరెక్ట్ గా చెప్పేసరికి మంచు లక్ష్మి షాకయ్యింది. ఆ మూవీ రిలీజ్ అయ్యాక రీతుని ఇంట్లో చిత్ర పేరుతోనే ఎక్కువగా పిలిచేది అందుకే ఆ పేరు గుర్తుండిపోయింది చెప్పింది. ఏ మూవీ రిలీజ్ ఐతే ఆ మూవీ క్యారెక్టర్ నేమ్ తో ఇంట్లో పిలుస్తూ ఉంటా అని చెప్పింది సంగీత.
"మీలో ఒకరి సెల్ పాస్వర్డ్ మరొకరికి తెలుసా అని అడిగేసరికి "నా సెల్ పాస్వర్డ్ రీతుకి తెలుసు ఓపెన్ చేసుకుని చూసుకుంటుంది కానీ తన సెల్ పాస్వర్డ్ ఎప్పటికప్పుడు మార్చేస్తుంది. స్మార్ట్ కిడ్స్ కదా " అని చెప్పింది సంగీత. "రీతూ మీ అమ్మను ఏ ముద్దు పేరుతో పిలుస్తావ్" అనేసరికి " అమ్మ పేరు సంగీత కదా గీతూ" అని పిలుస్తానని చెప్పింది. ఇలా టాస్క్ రౌండ్ ని కంప్లీట్ చేసింది మంచు లక్ష్మి.