English | Telugu
అమ్మతో మొదటి వ్లాగ్ చేసిన టేస్టీ తేజ!
Updated : Mar 11, 2024
టేస్టీ తేజ గురించి ఇప్పుడు అందరికి తెలిసిందే. ఎప్పుడు ఫుడ్ వ్లాగ్స్ తో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంటూ వస్తున్నాడు తేజ. ఇప్పుడు తాజాగా వాళ్ళ అమ్మతో కలిసి మొదటి వ్లాగ్ చేశాడు.
తన యూట్యూబ్ సబ్ స్క్రైబర్స్ కోరిక మేరకి వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి ఓ వ్లాగ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశాడు తేజ. గోవాకి తీసుకొని వెళ్ళి అక్కడ ఓ రెస్టారెంట్ లో టిఫిన్ చేశాడు తేజ. వినాయకచవితికి తేజ హౌస్ లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ ఓ వినాయకుడిని కొనిందంట. తన ఆశీస్సులు ఉంటే తేజ సేవ్ అవ్వాలని కోరుకుందంట.. అలాగే రతిక, తేజ నామినేషన్ లో చివర్లో ఉన్నప్పుడు తేజ సేవ్ అయ్యాడని తేజ వాళ్ళ అమ్మ చెప్పింది. గోవాలోని ఓ టిఫిన్ షాప్ లో నెయ్యి ఇడ్లీ, ఉప్మా దోశ, అన్నీ టేస్ట్ చేసారంట. అందులో ఏది బాగుందో చెప్పమని వాళ్ళ అమ్మని తేజ అడుగగా.. నెయ్యి ఇడ్లీ కారం బాగుందని చెప్పింది. ఇక గోవా బీచ్ లో ఇసుకపై అమ్మ అని రాసుకొచ్చాడు తేజ. వాళ్ళ అమ్మనాన్నలని ఇద్దరిని కలిపి ఓ చిన్న వీడియో క్లిప్ కూడా ఈ వ్లాగ్ లో ఆడ్ చేశాడు.
బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన వారిలో తేజ ఒకడు. తేజ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయక ముందు జబర్దస్త్ లో కమెడియన్ గా నటించాడు. ఐతే ఈరోజు తేజ ఇలా ఒక సెలబ్రిటీ స్థాయికి రావడానికి కారణం జబర్దస్త్ టీమ్ లీడర్ అదిరే అభి అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆయన లేకపోతే తనసలు ప్రజలకు తెలిసేవాడినే కాదన్నారు తేజ. ఇటు బుల్లితెరతో పాటు అటు సోషల్ మీడియాలో కూడా తేజకు మంచి ఫాలోయింగ్ ఉంది. తేజ తన యూట్యూబ్ ఛానెల్ లో 200కి పైగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినిమాలను తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రమోట్ చేశాడు. ఐతే జబర్దస్త్ లో కనిపించినా, బిగ్ బాస్ లో కనిపించినా ఫ్యూచర్ చాల బ్రైట్ గా ఉంటుంది అనడానికి చాలా మంది ఉదాహరణులుగా ఉన్నారు.