English | Telugu

శోభనం గదిలో నిజాలు బయటపెట్టిన భార్య.. షాక్ లో భర్త!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి '. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -414 లో... ముకుంద శోభనం గదిలోకి పాల గ్లాస్ తో వస్తుంది. అది చూసి ఆదర్శ్.. ఈ క్షణం కోసం ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నాని అంటాడు. ఆ తర్వాత పాలు అందుకున్న ఆదర్శ్ తాను సగం తాగి.. మిగిలినవి ‘తాగు ముకుందా’ అని అందిస్తుంటే.. ‘ఇవి నీ ఎంగిలి పాలు ఆది.. అవి నేను తాగలేను. ఇవే ఎంగిలి పాలు.. నీ చేతి నుంచి కాకుండా మురారీ చేతి నుంచి అందుకుని ఉంటే.. పట్టలేనంత సంతోషంగా తాగేదాన్ని’ అంటూ తన మనసులో మాటను ముకుంద బయటపెడుతుంది. దాంతో ఆదర్శ్ చేతిలోని గ్లాస్ నేలకు వదిలేసి షాక్‌లో నిలబడిపోతాడు. ముకుంద మాత్రం తన మనసులో మాటలను ఒక్కొక్కటిగా చెబుతూనే ఉంటుంది.

ఏం మాట్లాడుతున్నావ్ ముకుందా అని ఆదర్శ్ అంటాడు. నిజం మాట్లాడుతున్నా ఆది.. ఇప్పటికైనా నువ్వు తెలుసుకోవాల్సిన నిజం.. నా మనసులో, ఆలోచనల్లో మురారీనే నిండిపోయి ఉన్నాడు. మురారీ తప్ప మరొకరు నా జీవితంలోకే కాదు. నా ఆలోచనల్లోకి రావడం కూడా అసాధ్యమే.. నీతో అడుగులు వెయ్యాల్సి వచ్చిన ప్రతిసారీ నరకం చూశాను. నీలో మురారీని ఊహించుకుని ఇంతకాలం నెట్టుకొచ్చానని ముకుంద అంటుంది. ఇక ఆవేశంగా.. ఆవేదనగా చూస్తుంటాడు ఆదర్శ్. కానీ ముకుంద అదేం పట్టించుకోకుండా చెప్పాలనుకున్నదంతా చెప్పేస్తూ ఉంటుంది. ఇక అదంతా ఉత్కంఠభరితంగా సాగుతుంది.

మరోవైపు శోభనం గదిలో ఉన్న మురారీ, కృష్ణలు గదిలో కంగారు పడుతూనే ఉంటారు. ‘ముకుంద ఏదో చేయబోతుంది. నాకు కీడు శంకిస్తుందని మురారీతో కృష్ణ అంటుంది. ఏం చేసినా తను మనల్ని విడదీయలేదు కృష్ణ అని మురారి అంటాడు. ఇంతలో రేయ్ మురారీ.. రారా బయటికీ అని ఆదర్శ్ హాల్లోకి వచ్చి పెద్దపెద్దగా అరుస్తుంటాడు. కింద హాల్లోంచి.. ఆదర్శ్ అరుపులకు మధు, రేవతి, సుమలత పరుగున వస్తారు. ఏం అయ్యిందంటూ కంగారు పడతారు. ఇంతలో ముకుంద పైన మేడ మీద నుంచే నిలబడి కిందకు చూస్తుంటుంది. మురారీ, కృష్ణ కిందకు పరుగున వస్తారు. రేవతి, మధు, సుమలత కంగారుగా చూస్తుంటారు.

మురారీ, కృష్ణ కిందకు వస్తారు. ఏం అయ్యిందిరా.. ఈ టైమ్‌లో గదిలోంచి బయటికి వచ్చావేంటి నాన్నా అని ఆదర్శ్ తో రేవతి అంటుంది. అంతా వీళ్లిద్దరికి తెలుసు పిన్నీ.. వీళ్లే నా జీవితాన్ని నాశనం చేశారంటూ మురారీ కాలర్ ని ఆదర్శ్ పట్టేసుకుంటాడు. చెప్పురా ఎందుకు ఇలా చేశావ్. నన్ను ఎందుకు ఇక్కడికి రప్పించావ్.. నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశావంటూ ఆదర్శ్ అక్కడే కూలబడి కుమిలికుమిలి ఏడ్చేస్తాడు. ఇక అక్కడివాళ్ళంతా బిత్తరపోతారు.

ఇక తరువాయి భాగంలో .. ఏం చేస్తున్నావ్ కృష్ణా అంటూ రేవతి కోపంగా అరుస్తుంది. అత్తయ్యా.. ఎవరి మనసులో ఏముందో.. ఎవరి ఆలోచనల్లో ఏముందో మొత్తం తేలిపోవాలని కృష్ణ అంటుంది. దాంతో ముకుంద తెగిస్తుంది. నా మనసులో ఉన్నది ఉంటున్నది ఉండబోయేది మురారీనే.. ఇందులో ఏ మార్పు లేదు. మురారీతోనే నా జీవితమని ముకుంద అరిచి చెబుతుంది. దాంతో అంతా షాక్ అయిపోతారు. వెంటనే కృష్ణ.. ‘ముకుందా..’ అని అరుస్తూ లాగిపెట్టి కొట్టేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.