English | Telugu

ఒక రోజు, రెండు రోజు లవ్‌లు ఈ వయసుకు అవసరం లేదు!

చిల్డ్రన్స్ డే సందర్భంగా లిటిల్ హార్ట్స్ పేరుతో ప్రసారమైన షోలో పిల్లలకు మధ్య పోటీ మంచి రసవత్తరంగా సాగింది. ఇక ఈ షోకి హోస్ట్స్ గా సిరి హన్మంత్, డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ వచ్చారు. అలాగే ఈ షోకి జడ్జెస్ గా ఆమని, అన్నపూర్ణ వచ్చారు. మణికంఠ చిన్నపిల్లలతో డాన్స్ చేయించి స్టేజి ఇరగొట్టేసారు. ఇక పిల్లల్ని పేరెంట్స్ నిద్ర పుచ్చే టాస్క్ ఇచ్చారు యాంకర్స్.

ఐతే పేరెంట్స్ ఎంత ట్రై చేసినా వాళ్ళు నిద్రపోకుండా అల్లరి చేసేసరికి పిల్లలు గెలిచారని అనౌన్స్ చేసాడు డాక్టర్ బాబు. ఇక పల్సర్ బైక్ రమణ వచ్చి టిక్ టాక్ బాను కి లవ్ ప్రొపోజ్ చేసాడు. దాంతో స్టేజి మొత్తం నవ్వులు విరిశాయి. అలాగే రమణ స్టేజి మీదకు వాళ్ళ అమ్మను పిలిచేసరికి "మీకు అమ్మాయి నచ్చిందా" అని ఆది అడిగాడు. "అమ్మాయి నచ్చింది" అని ఆమె కూడా చెప్పేసింది.

ఇక భాను కోసమే రెండు పాటలు కూడా పాడాడు. ఇక అన్నపూర్ణ ఆ పాటలు విని ఫుల్ మెస్మోరైజ్ ఐపోయింది. ఇలాంటి ఒక రోజు, రెండు రోజు లవ్ లు ఈ వయసుకు అవసరం లేదు దాని గురించి ఆలోచించకు అని చెప్పింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.