English | Telugu
బిగ్ బాస్ 6 విన్నర్‌ని నేనే!
Updated : Sep 3, 2022
మరికొన్ని గంటల్లోనే బుల్లితెర మీద సందడి చేయడానికి సిద్ధంగా ఉంది బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 . క్వారంటైన్‌లో ఉన్న ఇంటి సభ్యులు.. హౌస్‌లో అడుగుపెట్టేందుకు రెడీ అయ్యారు. గత ఎపిసోడ్స్ లా కాకుండా ఈ సీజన్ ఓ రేంజ్‌లో ఎంటర్‌టైన్మెంట్ అందిస్తుందంటూ నిర్వాహకులు చెప్పారు. ఇక ఈసారి హౌస్ లో రూల్స్ కూడా మారబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా టాస్కులు కూడా టఫ్ గా ఉంటాయని కూడా చెప్పారు.
అలాగే బీబీ కెఫె అనే ఒక స్పెషల్ ఎపిసోడ్ ని కూడా దీనికి రిలేటెడ్ గా స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించి షూటింగ్ కూడా ఐపోయింది. ఐతే ఈసారి హౌస్‌లోకి పాపులర్ సింగర్ రేవంత్ వెళ్తున్నాడు. ఈ విషయం తన ఇన్స్టా ద్వారా ఫాన్స్ కి చెప్పాడు. అసలు బొమ్మే పడలేదు, అప్పుడే టైటిల్ గెలుచుకుని వస్తానంటూ ఒక పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టేసాడు.
“జీవితంలో కొన్నింటిని వదులుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. నా కుటుంబాన్ని మిస్ అవుతున్నాను, ముఖ్యంగా నా భార్యను, నాకు ఇష్టమైన మ్యూజిక్‌ని మిస్ అవుతున్నాను. కానీ, ఒక భగీరథుడి సాధనలా గెలిచి మంచి పేరుతో బయటకు వస్తాను. మీరు మీ ఆదరణను ఓటింగ్స్ రూపంలో నాకు అందించండి. నా వైపు నుంచి వందశాతం ఎంటర్‌టైన్ అందిస్తాను.మీ అందరి దీవెనలతో నేను టైటిల్ తో తిరిగొస్తాను..” అంటూ రేవంత్ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఈ స్టోరీ పోస్ట్ చేశాడు. ఇప్పుడు అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.