English | Telugu

శ్రీముఖి, శ్రీచరణ్ గురించి నిజాలు ఇవే!

'సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్' రియాలిటీ షో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంగీత ప్రియులకు మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించింది. సుధాన్షు, శృతిక ఫైనల్స్ వరకు వెళ్లారు. శృతిక సింగింగ్ సూపర్ స్టార్ అవార్డును అందుకుంది. సుధాన్షు రన్నరప్ గా నిలిచాడు. స్టేజిపై శ్రీముఖి, శ్రీచరణ్ మధ్య లవ్ ట్రాక్ న‌డ‌వ‌డం మ‌నం చూశాం. శ్రీ‌ముఖి ఓ అడుగు ముందుకు వేసి, శ్రీచరణ్ వాళ్ళ నాన్నను "మావయ్యా" అని పిలవడం అందరికీ తెలిసిన విషయమే. ఐతే ఈ షోలో మనం చూసిన లవ్ ట్రాక్ గురించి సుధాన్షు కొన్ని ఇంటరెస్టింగ్ సీక్రెట్స్ రివీల్ చేసాడు.

తెలుగువ‌న్ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ,"శ్రీముఖి, శ్రీచరణ్ మధ్య లవ్ ట్రాక్ అనేది ఏమీ లేదు. అదంతా అనుకోకుండా జరిగింది. ఫస్ట్ ఎపిసోడ్ లో మెగా ఆడిషన్స్ జరిగే టైంలో కంటెంట్ రాసే వాళ్ళు శ్రీచరణ్ ని చూసారు. మంచి హైట్ కూడా ఉన్నాడు అనుకున్నారు. అప్పటికే చరణ్ కూడా తనకు సాంగ్స్ తో పాటు డాన్స్ కూడా వచ్చని చెప్పేసరికి వాళ్ళు శ్రీముఖి పక్కన సరిపోతాడని అనుకుని సరదాగా "జల జల జలపాతం" సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో వస్తుంటే వీళ్ళు డాన్స్ చేసేలా కంటెంట్ లో రాశారు. అక్కడ స్టార్ట్ అయ్యింది అసలు విషయం." అని చెప్పాడు.

ఐతే చరణ్ కదలకుండా సిగ్గు పడుతూ ఒక పక్కన నిలబడిపోయేసరికి శ్రీముఖి తానే ముందుకొచ్చి చరణ్ కి కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసి డాన్స్ చేయించిందంట‌."ఇక ఆ తర్వాత జ‌రిగింది అందరికీ తెలిసిన స్టోరీనే. ప్రతీ ఎపిసోడ్ కి చరణ్ కంగారు పడుతుండేవాడు.. త‌న చేత ఏం చేయిస్తారో, ఏం చెప్తారో ఏంటో అని. వీళ్ళ విషయాన్ని అందరూ సరదాగా తీసుకున్నారు కాబట్టి లాస్ట్ వరకు అలా కంటిన్యూ అయ్యింది. ఐతే వీళ్ళు ఆన్ స్క్రీన్ లో ఇలా ఉంటారు కానీ, ఆఫ్ స్క్రీన్ లో మంచి ఫ్రెండ్స్ ఇద్దరూ. శ్రీముఖిని అక్కా అని పిలుస్తాడు చరణ్. చరణ్ ని ఏడిపించడానికి మాకు ఒక అవకాశం ఇలా దొరికినందుకు మాకు హ్యాపీ" అంటూ వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ని బయట పెట్టాడు సుధాన్షు.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.