English | Telugu
BiggBoss Season 7 buzz Interview: గౌతమ్ కృష్ణది ఓవర్ థింకింగ్.. ఆమె మాటతీరు మార్చుకోవాలి: టేస్టీ తేజ!
Updated : Nov 6, 2023
బిగ్ బాస్ హౌస్ లో తొమ్మిదవ వారం టేస్టీ తేజ ఎలిమినేషన్ అందరికి షాకింగ్. ఎందుకంటే శోభా శెట్టి ఎలిమినేషన్ అవ్వాల్సింది తేజ అయ్యాడు. అయితే తేజ ఎలిమినేషన్ తర్వాత ఎగ్జిట్ ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలసిందే.
బిగ్ బాస్ సీజన్-7 ఎగ్జిట్ ఇంటర్వ్యూ గీతు రాయల్ తో జరిగింది. అయితే ఈ ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలని షేర్ చేసుకున్నాడు టేస్టీ తేజ. 9th వీక్ ఎలిమినేషన్ ఎలా అనిపిస్తుందని యాంకర్ అడుగగా.. ఏడు, తొమ్మిది, పన్నెండు, తొమ్మిది వారాలు ఉన్నాను చాలని తేజ అన్నాడు. అసలేం ఆడావ్ తేజ అని యాంకర్ అడుగగా.. బూరలు ఊదాను, లైన్ లోకి వెళ్ళి బిల్లలు తెచ్చాను, పండ్లు తెచ్చానని టేస్టి తేజ అన్నాడు.
అరవై మూడు రోజుల్లో ఇరవై అయుదుకి పైగా టాస్క్ లు పెడితే నువ్వు చెప్పింది రెండు అని యాంకర్ నవ్వుకుంది. షకీల అమ్మని వదిలేస్తే మొదటి వారం నుండి గతవారం వరకు అందరు నువ్వు నామినేట్ చేస్తే బయటకు వచ్చినవాళ్ళే అని యాంకర్ అనగా తేజ నవ్వేశాడు. ఇక ఆ తర్వాత తేజపై వచ్చిన ట్రోల్స్ ని స్క్రీన్ మీద వేసి చూపించింది యాంకర్. నీకు శోభాకి మధ్యలో ఏంటని యాంకర్ అడుగగా.. నవ్వేసుకున్నాడు తేజ. ఎందుకు నవ్వుతున్నావని అడుగగా.. అదేం లేదు మా మధ్య ఒక ఫ్రెండ్ షిప్ ఉందని తేజ అన్నాడు.
ఇక హౌస్ మేట్స్ గురించి చెప్పమని యాంకర్ అడుగగా.. మనోడికి కొంచెం ఆలోచన, ఓవర్ థింకింగ్ ఎక్కువ అని గౌతమ్ కృష్ణ గురించి తేజ అన్నాడు. ఆటపరంగా బాగుంటుంది కానీ మాట పరంగా కొంచెం అర్థం చేసుకోవాలి ఈ పిల్ల అని అశ్వినిశ్రీ గురించి తేజ చెప్పాడు. ఇకా హౌస్ లో ఒకొక్కరు తనతో ఎలా ఉన్నారో, నెగెటివ్ వైబ్స్, పాజిటివ్ వైబ్స్ అంటూ కొన్ని ఆసక్తికరమైన విషయాలని పంచుకున్నాడు తేజ. కాగా ఇప్పుడు ఈ బజ్ ఇంటర్వ్యూ ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.