English | Telugu
Bigg Boss Season 7 Telugu Family Week: సీజన్-7 ఫ్యామిలీ వీక్ ఎప్పుడో తెలుసా!
Updated : Nov 6, 2023
బిగ్ బాస్ సీజన్ ఉల్టా పల్టా థీమ్ తో ఆసక్తికరంగా సాగుతుంది. అయితే ఇందులో కామన్ మ్యాన్ క్యాటగిరీలో పల్లవి ప్రశాంత్, హీరో శివాజీ, ప్రిన్స్ యావర్, సీరియల్ యాక్టర్స్ అమర్ దీప్ , ప్రియాంక జైన్, శోభా శెట్టి, అంబటి అర్జున్, పాటబిడ్డ గా భోలే షావలి, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్ గా అశ్వినిశ్రీ, హీరో అండ్ యాక్టర్ గౌతమ్ కృష్ణ.. ప్రస్తుతం హౌస్ లో ఉన్నారు. ఇక నామినేషన్ ఎలిమినేషన్ అంటు ఎప్పుడు ఏదో ఒక టాస్క్ లతో కంటెస్టెంట్స్ తో వినోదాన్ని పంచుతున్నాడు బిగ్ బాస్.
ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఫ్యామిలీ వీక్ అప్డేట్ రానే వచ్చింది. గత సీజన్‌లో ఆదిరెడ్డి ఫ్యామిలీ, ఫైమా వాళ్ళ అమ్మ , రేవంత్ వాళ్ళ అమ్మ రావడం ఆ వారం మొత్తం అత్యధిక టీఆర్పీ నమోదు చేసుకుంది. దాంతో ఈ సీజన్ అలాంటి సెంటిమెంట్ ఎపిసోడ్ లని బిగ్ బాస్ గట్టిగా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే శివాజీకి చేయి బాగోలేకపోవడంతో కాస్త కాన్ఫిడెన్స్ తగ్గిందని, అదే మరి శివాజీ భార్య, కొడుకు రిక్కీ వస్తే మరింత జోష్ తో యాక్టివ్ గా ఆడతాడని, అందుకే ఫ్యామిలీ వీక్ ఈ వారమే బిగ్ బాస్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. అందుకే ఈ వారమే గౌతమ్ కృష్ణ వాళ్ళ అమ్మ, యావర్ వాళ్ళ సోదరుడు, ప్రశాంత్ వాళ్ళ నాన్న, అమర్ దీప్ వాళ్ళ భార్య తేజస్విని గౌడని హౌస్ లోకి ఈ వారం తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది.
గత వారం ఎలిమినేషన్ చివరి దాకా వచ్చి సేవ్ అయిన శోభాశెట్టి వాళ్ళ అమ్మని, ప్రియాంక జైన్ బాయ్ ఫ్రెండ్ శివని, అంబటి అర్జున్ భార్యని కూడా హౌస్ లోకి తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నట్టుగా తెలస్తోంది. అయితే ఇప్పటికే బిగ్ బాస్ సీజన్-7 అల్టిమేట్ టీఆర్పీతో దూసుకెళ్తుంది. ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ లని బిగ్ బాస్ ఈ వారం మొదలు పెడితే భారీ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే హౌస్ లోకి ఎవరెవరి ఫ్యామిలీ మెంబర్స్ వస్తారో ఇంకా తెలియాల్సి ఉంది.