English | Telugu

భైరవకోన మంత్రదండం కూడా సుమ మాట వినట్లేదట...


సుమ అడ్డా నెక్స్ట్ వీక్ షోకి గెస్ట్ గా వచ్చిన సందీప్ కిషన్ తో కలిసి ఫుల్ ఎంటర్టైన్ చేసింది యాంకర్సు మ. ఈ షోకి "ఊరి పేరు భైరవకోన" మూవీ టీమ్ ప్రమోషన్స్ కోసం వచ్చింది. అలాగే హీరోహీరోయిన్స్ సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ వచ్చారు. సందీప్ కిషన్ చేతిలో మంత్రం దండంతో ఎంట్రీ ఇచ్చాడు. "ఆమ్ హోమ్ పట్..నా అంత అందంగా ఇక్కడ ఉండేవాళ్ళను తయారు చేద్దామంటే అది జరిగే పనిలా అనిపించడం లేదు." అని సుమ కామెడీగా చెప్పేసరికి "జరగని పనికి ప్రయత్నిస్తే మంత్రదండం మాత్రం ఏం చేస్తది" అని కౌంటర్ వేసాడు సందీప్ కిషన్. ఈ షోకి మూవీ రైటర్ ఆనంద్ కూడా వచ్చారు. సుమ ఆయన్ని ఇలా అడిగింది "మీరు కథ రాసేటప్పుడు కథ మిమ్మల్ని హాంట్ చేయదా..అలా భయపడినప్పుడు ఏం చేస్తారు మీరు" అని అడిగింది సుమ. "చాలా హాంట్ చేస్తుంది అప్పుడు నేను ఒక ఆరేడుమందితో కలిసి పడుకుంటాను" అని చెప్పాడు.

"ఆరేడుమందితోనా" అని ఆయన ఇచ్చిన ఆన్సర్ కి సుమ షాకయ్యింది. "నేను చెప్పింది ఫామిలీ మెంబర్స్ గురించి అండి" అన్నాడు రైటర్ ఆనంద్. తర్వాత ఆటో రామ్ ప్రసాద్ తో కలిసి అలనాటి పాత మధురగీతం "తెలిసిందిలే తెలిసిందిలే" అనే సాంగ్ కి సుమ నాట్యం చేసింది. ఫైనల్ గా సందీప్ కి రాఖీ కట్టింది సుమ...ఎప్పుడు రాఖీ కడితే అప్పుడే రాఖీ పండగ అని నవ్వేసింది సుమ. లవ్ యు అక్క అంటూ సందీప్ కిషన్ సుమ కాళ్లకు దణ్ణం పెట్టుకుని హగ్ చేసుకున్నాడు. సందీప్ కిషన్ రీసెంట్ గా ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ మూవీలో ధనుష్ ఫ్రెండ్ రోల్ లో నటించి మెప్పించాడు. 2010 లో వచ్చిన ప్రస్థానం, స్నేహగీతం మూవీస్ తో పరిచయమయ్యాడు సందీప్ కిషన్. చేసినవి చిన్న పాత్రలైనా మంచి పేరు వచ్చింది. 2011 లో 'షోర్‌ ఇన్‌ ద సిటీ' మూవీతో బాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. తమిళ మూవీస్ లో వరసగా నటించి మంచి ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత రిలీజ్ ఐన రొటీన్ లవ్ స్టోరీ, గుండెల్లో గోదారి మూవీస్ సందీప్ కిషన్ కి హీరో ఇమేజ్ ని తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత నుండి సోలో హీరోగా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, జోరు, రా రా కృష్ణయ్య, బీరువా, టైగర్, నక్షత్రం ..ఇలా దాదాపు 25 సినిమాలకి పైగా నటించాడు.