English | Telugu

పవన్ కళ్యాణ్ గారి తాలూక.. గాజులేసుకోండి ఆది!


శ్రీదేవి డ్రామా కంపెనీ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి కమిటీ కుర్రాళ్ళు మూవీ టీమ్ సరదాగా ఫన్ చేయడానికి వచ్చింది. దాంతో ఇక్కడ రెండు వర్గాల మధ్య పోటీ గట్టిగా జరిగింది. శ్రీదేవి డ్రామా కంపెనీ వెర్సెస్ కమిటీ కుర్రాళ్ళుగా ఈ షో మారిపోయింది. ఇక ఇందులో రెండు టీమ్స్ మధ్య డైలాగ్స్ వరద మాములుగా లేదు. రైటర్ త్రివిక్రమ్ కూడా తక్కువే. అన్ని డైలాగ్స్ వీళ్ళు చెప్పారు. "ఏమిటి మేము లేకుండా జాతర జరిపిస్తున్నారు..కమిటీ కుర్రాళ్ళు ఇక్కడ" అని ఆ మూవీ టీమ్ ఆదికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. " పది రోజుల క్రితం ఈటీవీ విన్ కి వచ్చిన మీకే అంత ఉంటే పదేళ్ల నుంచి ఈటీవీలో ఉన్న మాకు ఎంతుండాలి" అన్నాడు ఆది.

తర్వాత కమిటీ కుర్రాళ్ళ నుంచి ఇంకో కుర్రాడు వచ్చి "నా పేరు ఆత్రం..నాకు అన్నిటికీ తొందరే" అనేసరికి.. " నా పేరు ఆది నేను ఆ ఒక్కదానిలోనే ముందర" అని సెటైర్ వేసాడు. మళ్ళీ ఇంకో కమిటీ కుర్రాడు వచ్చి "మేము కొణిదెల నిహారిక గారి తాలూకా ఇక్కడా" అన్నాడు. "మేము ఎవరి తాలూకానో తెలుసా..కొణిదెల పవన్ కళ్యాణ్ గారి తాలూకా" అని ఆది అన్నాడు. దాంతో స్టేజి మొత్తం ఈలలేసింది. తర్వాత సద్దాం స్టేజి మీద జాతర సందర్భంగా ఆడవాళ్ళ గాజులు అమ్ముతూ ఉంటాడు. ఇంతలో కమిటీ కుర్రాళ్ళు, ఆది టీమ్ వచ్చారు. "ఆ కమిటీ కుర్రాళ్ళు గాజులు కొంటె మేము కొనం" అన్నాడు ఆది. "సద్దాం ముందు ఆది గారికే గాజులమ్మేయ్..సర్ మీరు గాజులేసుకోండి" అన్నారు కమిటీ కుర్రాళ్ళు.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...