English | Telugu

పవన్ కళ్యాణ్ ఒక్కరే ట్రైబల్ కల్చర్ ని బతికేస్తున్నారు...

శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఈ వీక్ ట్రైబల్ థీమ్ తో ఎపిసోడ్ రన్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి కొమ్ము కోయ ట్రైబల్ స్పెషల్ డాన్స్ చేయడానికి భద్రాచలం రమేష్ ట్రూప్ వచ్చి ఎంటర్టైన్ చేసింది. ఇక ఆది ఈ ట్రైబల్ డాన్స్ అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఎంత ఇష్టమో కూడా చెప్పుకొచ్చాడు ఈ షోలో. "ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇంతమంది ఈ కొమ్ము కోయ ట్రైబల్ డాన్స్ కళను బతికించడం మామూలు విషయం కాదు. రాజకీయ నాయకులు స్టేజి పెట్టినప్పుడు వచ్చిన జనాలు వెనక్కి వెళ్లకుండా రికార్డింగ్ డాన్స్ లు అవీ పెడతారు.

కానీ ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఏదన్నా పొలిటికల్ స్టేజిలు అవీ పెట్టినప్పుడు ఫస్ట్ ఇలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళతో ఒక కార్యక్రమం చేశాకే ఆయన మీటింగ్ స్టార్ట్ చేస్తారు. రణస్థలంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన కూడా వీళ్ళతో కలిసి డాన్స్ చేసారు. ఆయన డాన్స్ చేయడం మాకు హ్యాపీ అనిపించింది. ఆయన డిప్యూటీ సీఎం ఐన వెంటనే ఫస్ట్ రోడ్ వేయడం స్టార్ట్ చేసింది అక్కడే. ఆ ఊరి వాళ్లకు వేసుకోవడానికి చెప్పులు కూడా లేకపోతె ఆయనే ఆ ఊరు మొత్తానికి చెప్పులు కొని పంపించారు. ఇలాంటి కళను ఎంకరేజ్ చేసే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి పాలిటిక్స్ లో ఉండడం మనందరి అదృష్టం. ఆయన కొడుకు మార్క్ శంకర్ సింగపూర్ లో వాళ్ళ స్కూల్ లో ఫైర్ ఆక్సిడెంట్ ఐనప్పుడు పవన్ కళ్యాణ్ కన్నీళ్లు పెట్టుకోవాల్సిన టైములో ఇలాంటి ట్రైబల్ ఏరియాకి వెళ్లి వాళ్ళ కన్నీళ్లు తుడిచాకే సింగపూర్ వెళ్లారు. అలాంటి గొప్ప మనిషి పవన్ కళ్యాణ్ గారు." అంటూ చెప్పాడు ఆది.