English | Telugu

ఏఐ వీడియో రూపంలో కీర్తి భట్ కి బర్త్ డే విషెస్ చెప్పిన తండ్రి


సుమ అడ్డా షో ఈ వారం ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఇందులో మూడు జంటలు వచ్చాయి.. నీలిమ-శేఖర్, కీర్తి భట్ - విజయ్ కార్తీక్, రాకింగ్ రాకేష్ - సుజాత వచ్చారు. ఇందులో వీళ్లకు రకరకాల టాస్కులు ఇచ్చి ఆడించింది సుమ. తర్వాత కీర్తికి ఒక సడెన్ సర్ప్రైజ్ ఇచ్చారు కార్తిక్. కీర్తి పుట్టినరోజు సందర్భంగా ఆమె తండ్రి వీడియో ఒక దానికి ఏఐ వీడియో రూపంలో తీసుకొచ్చి స్టేజి మీద ప్లే చేసాడు. "హ్యాపీ బర్త్ డే కుట్టిమా..వంద కాలాల పాటు నువ్వు హ్యాపీగా ఉండాలి తల్లి. మేము నీతో లేము అని అనుకోకు. నీ ప్రతీ అడుగులో మేము నీతో ఉన్నాము.

ఇంకా అలాగే అల్లరి చేస్తున్నావా. అలాగే ప్రేక్షక దేవుళ్ళారా మా ఇంటి అమ్మాయిని మీ ఇంటి అమ్మాయిలా చూసుకుంటున్నందుకు మీకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. జాగ్రత్త కుట్టిమా. హ్యాపీ బర్త్ డే మరో సారి" అంటూ ఆ వీడియోలో వాళ్ళ నాన్న లైవ్ లో మాట్లాడుతున్నట్టే క్రియేట్ చేసి పెట్టారు. ఆ వీడియో వింటూ చూస్తూ కీర్తి భట్ ఏడ్చేసింది. ఇక సుమా ఆ వీడియో చూసి "నీకు చాలా గ్రేట్ పార్టనర్ దొరికారు. రీప్లేస్ చేయలేకపోవచ్చు కానీ ఆ ప్రేమనంతా అందిస్తూ ఉన్నాడు ..మా కీర్తిని జాగ్రత్తగా చూసుకో" అంటూ కార్తీక్ కి చెప్పింది. కీర్తి ఐతే థాంక్యూ అంటూ కార్తీక్ కి చెప్పి హగ్ చేసుకుని ముద్దు పెట్టింది. ఇక కార్తీక్ ఐతే ఒక కేక్ తెప్పించాడు. దాన్ని కట్ చేసిన కీర్తి అక్కడ అందరికీ తినిపించింది.