English | Telugu

శోభాశెట్టి ఎలిమినేషన్.. చెత్త కంటెస్టెంట్ అంటూ ట్విట్టర్ లో ట్రెండింగ్!


బిగ్ బాస్ హౌస్ లో గ్రూప్ గా కలిసి గేమ్ ఆడట్లేదని చెప్తూనే కలిసి గేమ్ ఆడుతున్న సీరియల్ బ్యాచ్ కి ఇక రోజులు దగ్గరపడ్డాయంటూ ట్విట్టర్ ట్రెండింగ్ నడుస్తుంది. శోభాశెట్టిని ఎలాగైనా హౌస్ నుండి బయటకు పంపించేయాలని బిగ్ బాస్ చూసే అభిమానులు కోరుకుంటున్నారు.

అమర్ దీప్, ప్రియంక జైన్, శోభా శెట్టి, ఆట సందీప్, టేస్టీ తేజ అందరు కలిసి ఎవరిని నామినేట్ చేయాలో మాట్లాడుకున్నది గత రెండు రోజులుగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఒక వారం నామినేషన్లో టేస్టీ తేజ గ్రూపిజం గురించి వివరణ ఇచ్చాడు‌.

ముగ్గురు లేదా నలుగురు ఒక్కటిగా మట్లాడుకొని వచ్చి, ఒకేలా చేస్తే అది గ్రూపిజం కానీ తెలిసినవాళ్ళు కలసి ఉంటే అది ఫ్రెండ్ షిప్ అంటూ ఒక వివరణ ఇచ్చాడు. ఇక మొన్న జరిగిన 8వ వారం నామినేషన్ కి ముందు.. "రేయ్ నువ్వు శివన్నకి వేయు మిగిలిన వాళ్ళని మేం చూసుకుంటాం" అంటూ టేస్టీ శోభాశెట్టి చెప్పింది కోట్లాది మంది అభిమానులు చూసారు‌. ఇక తాజాగా జరిగిన టాస్క్ లో మన అమర్ దీప్ కి జ్ఞానం లేదని , ఫౌల్ ఆడి తప్ప గెలవలేడని భావించి ఆన్సర్ చెప్పమని ప్రియాంక, శోభాశెట్టి లతో డీల్ కుదుర్చుకున్నాడు.