English | Telugu

డాన్స్ చేయకుండా అస్సలు ఉండలేను...యాక్టింగ్ కన్నా అదే ఇష్టం!

బిగ్ బాస్ స్టేజి మీద అలనాటి అందాల తార రాధా ఎంట్రీ ఇచ్చింది. బిబి జోడి షోకి రాధా జడ్జిగా చేస్తున్న సంగతి తెలిసిందే. వేదికపైకి వచ్చిన రాధాతో నాగార్జున సరదాగా మాట్లాడింది. "ఏమిటి డాన్స్ స్టెప్స్ వేసుకుంటూనే వచ్చారు" అని నాగ్ అడిగేసరికి "అవును నాకు చిన్నప్పటినుంచి డాన్స్ అంటే ఇష్టం.

మా అమ్మ ఒక కండిషన్ కూడా పెట్టింది. డాన్స్, మ్యూజిక్ వీటిల్లో కచ్చితం ఫస్ట్ త్రీ ప్రైజెస్ లో ఏదో ఒకటి గెలుచుకోవాలి లేదంటే ఇంటికి రావద్దు" అని చెప్పింది. అలా యాక్టింగ్ కన్నా డాన్స్ అంటే చాలా ఇష్టం. "ఫోర్త్ క్లాస్ నుంచి డాన్స్ చేస్తున్నా. అది కూడా క్లాసికల్ డాన్స్. మన ప్యాషన్ ని పోలిష్ చేస్తూ ఉంటే అదే మనల్ని ఒక రేంజ్ లో నిలబెడుతుంది" అని చెప్పింది రాధ.

బాలాదిత్య తనకు పెద్ద ఫ్యాన్ ని అని చెప్పేసరికి ఆమెతో కలసి డ్యాన్స్ చేసే అవకాశాన్ని నాగార్జున ఇచ్చారు అలా "రాధా రాధా మదిలోన" అనే సాంగ్ కి ఇద్దరూ కలిసి డాన్స్ చేశారు.