English | Telugu
ఆమెను చూసినవారు సూసైడ్ చేసుకోరు...
Updated : Dec 19, 2022
బిగ్ బాస్ హౌస్ లోంచి ఆది రెడ్డి ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చాక హౌస్ లో ఉన్న కీర్తి, రేవంత్, శ్రీహాన్ గురించి కొన్ని విషయాలు చెప్పాడు. కీర్తిని ఈ స్టేజి మీద చూసిన రెండు రాష్ట్రాల ప్రజల్లో ఎవరైనా సూసైడ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా ఆగిపోతారు. కీర్తి ఎంతో మందికి ఇన్స్పిరేషన్. పీకల్లోతు కష్టాల్లో ఉండి కూడా టాస్కులు ఆడింది.. లైఫ్ లో తనను తాను బాగా డెవలప్ చేసుకుంది..ఇక రేవంత్ విషయానికి వస్తే 20 నెగటివ్స్ ఉంటే అతనిలో 40 పాజిటివ్స్ ఉన్నాయి. నెగటివ్స్ చెప్పడానికే అవకాశం వచ్చింది కానీ పాజిటివ్స్ చెప్పే అవకాశం రాలేదు. ఇక శ్రీహాన్ చాలా మంచి వాడు. నెక్స్ట్ లెవెల్ యాక్టర్ కూడా. బయటకి వచ్చాక మంచి అవకాశాలు వస్తే బాగుండు అనుకుంటూ ఉంటాడు. అతని మనసులో ఎప్పుడూ యాక్టింగ్ తప్ప వేరేది ఉండదు అని చెప్పాడు ఆదిరెడ్డి.
ఇక రేవంత్ మాట్లాడుతూ "ఆది నువ్వు బిగ్ బాస్ లో ఎలా ఉండాలో చెప్పినప్పుడల్లా నన్ను నేను మార్చుకుంటూ వచ్చాను . నీ ఫోటో నా దగ్గరే ఉంది..నువ్వెప్పటికీ నా గుండెల్లో ఉంటావ్ " అని చెప్పాడు. ఇక ఆదిరెడ్డి మాట్లాడుతూ "నేనేమన్నా తప్పు చేసి ఉంటే క్షమించండి. లైఫ్ లో ఎవరూ పర్ఫెక్ట్ కారు. నా డాన్స్ స్టెప్స్ తో ఇరిటేట్ చేసి ఉంటే దానికి సారీ" అని చెప్పాడు. ఇక స్టేజి మీదకు వాళ్ళ నాన్నను కూడా పిలిపించాడు. "వ్యవసాయం చేసి డబ్బు పోగొట్టుకుని అప్పులు చేసి అప్పులు వాళ్ళు వస్తే ఇంట్లో దాక్కునే వ్యక్తిని ఈరోజు ఇలా స్టేజి మీద నిలబెట్టడం చాలా గర్వంగా ఉంది" అని చెప్పాడు. ఇక వాళ్ళ వైఫ్ తో కలిసి స్టేజి మీద తన మార్క్ డాన్స్ వేసి ఎంటర్టైన్ చేసాడు.