English | Telugu

నేను నాలాగే ఉన్నాను.. అందుకే గెలిచాను!

బిగ్ బాస్ సీజన్-6 టైటిల్ విజేత రేవంత్.. ఎగ్జిట్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు.యాంకర్ శివ మాట్లాడుతూ, "రేవంత్ బ్రో.. బిగ్ బాస్ టైటిల్ విన్నర్. ఇప్పుడు ఎలా ఉంది నీ ఫీలింగ్. ఆ ట్రోఫీని అలా పైకి లేపినప్పుడు ఏం అనిపించింది?" అని అడిగాడు.

"ఏం జరిగింది,ఎలా జరిగింది?.. అనేది నా దృష్టిలో మ్యాటరే కాదు. ఇప్పుడు టైటిల్ నా చేతిలో ఉంది. పేరు సంపాదిస్తే డబ్బు ఆటోమేటిక్ గా సంపాదించొచ్చు" అని రేవంత్ చెప్పాడు. ఆ తర్వాత శివ మాట్లాడుతూ, "తన కోపమే తన శత్రువు అని అంటారు.. నీకు మాత్రం ఆ కోపం మిత్రుడు అయ్యింది" అని శివ అన్నాడు."ఈ 105 రోజుల్లో కోపం వచ్చినప్పుడు కోపం.. ప్రేమ వచ్చినప్పుడు ప్రేమ.. ఎలా ఉండాలో అలానే ఉన్నా తప్ప.. నేనైతే నా క్యారెక్టర్ ని మార్చుకోలేదు. జనం కోసం ఒక అమ్మాయిని పొగడాలి. జనం కోసం ఒక అమ్మాయికి స్టాండ్ తీసుకోవాలి. జనం కోసం ఇలా ఉండాలని చెప్పి ఏనాడు అనుకోలేదు. ఎందుకంటే నేనెలా ఉన్నానో అలాగే ఉన్నాను. కాబట్టే నేను ఇక్కడి వరకు వచ్చాననే నమ్మకం నాకుంది" అని చెప్పాడు.

"అందరూ మిమ్మల్ని టార్గెట్ చేసారు. అందరూ మిమ్మల్ని మాటలు అన్నారు. అవి మీరు ఎలా తీసుకున్నారు?" అని శివ ప్రశ్నించగా, "నా బ్యాడ్ లక్ ఏంటంటే.‌. ఎవరైతే నా వాళ్ళు అని అనుకుంటానో..వాళ్ళు కూడా వేరే వాళ్ళతో కలిసి ఒక మాట అన్నప్పుడు బాధ అనిపిస్తుంటుంది. ఇంకా హౌస్ లో ఎవరి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు.. వాళ్ళలోని పాజిటివ్ ని మాత్రమే ఎలివేట్ చేసుకుంటూ వచ్చారు. నేను మాత్రం నా నెగెటివ్ ని కూడా పాజిటివ్ గా మల్చుకున్నానో అప్పుడే నేను గెలిచాను. దట్స్ ద రీజన్ ఐ ఆమ్ ద విన్నర్" అని రేవంత్ చెప్పుకొచ్చాడు.