English | Telugu
అమ్మోరులో నాగార్జునలా ఉన్నావ్..సర్పంచ్ దోశ ఉంది
Updated : Jul 21, 2023
జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో రాకెట్ రాఘవ, వాళ్ళ అబ్బాయి మురారి ఇద్దరూ కలిసి మంచి ఫన్నీ స్కిట్ చేశారు. అందులో వాళ్ళు వేసిన పంచులు భలే ఫన్నీగా ఉన్నాయి. సోగ్గాడే చిన్ని నాయన మూవీలో అక్కినేని నాగార్జున, అఖిల్ గెటప్స్ లో వైట్ అండ్ వైట్ డ్రెస్ తో చేతిలో కర్రతో కనిపించారు. "నేను ఎవరో తెలుసా సోగ్గాడే చిన్ని నాయనా..అని రాఘవ అనేసరికి ...మరి నేనేమిటి మీ పెద్దనాయననా" అన్నాడు రాఘవ కొడుకు మురారి. దానికి షాకయ్యాడు రాఘవ. "నేను ఈ గెటప్ లో ఎలా ఉన్నాను... మాస్ మూవీలో నాగార్జున గారిలా ఉన్నానా, మన్మధుడు సినిమాలో నాగార్జున గారిలా ఉన్నానా" అని అడిగేసరికి "అమ్మోరులో నాగార్జున గారిలా ఉన్నావ్" అన్నాడు మురారి. " ఆ సినిమాలో నాగార్జున గారు లేరు కదరా అని రాఘవ అనేసరికి నువ్వు కూడా అలా లేవు కదా నాన్న" అన్నాడు మురారి. తర్వాత నాటీ నరేష్ స్కిట్ లో ఒక కమెడియన్ "ఎంఎల్ఏ దోశ ఏమన్నా ఉందా అనేసరికి సర్పంచ్ దోశ ఉంది" అన్నాడు నరేష్...
అదేంటి అని అడిగేసరికి ఎంఎల్ఏ ఓడిపోయి సర్పంచ్ అయ్యాడు కాబట్టి" అన్నాడు నరేష్. ఇక సద్దాం ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ లో స్కిట్ చేశారు. "శత్రువులు మనమీద పగ బట్టారు...తప్పనిసరిగా బాంబులు కావాలి..బాంబులు తయారు చేయడానికి మనకు ఏం కావాలిరా" అనేసరికి మిగతా వాళ్లంతా "సెనగపప్పు, మినప్పప్పు, గట్టిపప్పు" అని చెప్పేసరికి వాళ్ళను కొట్టాడు సద్దాం...ఫైనల్ గా వెంకీ మంకీస్- తాగుబోతు రమేష్ స్కిట్ లో వెంకీ రమేష్ కి కంగ్రాట్స్ చెప్పి "నువ్వు మళ్ళీ మావయ్య కాబోతున్నావ్..ఇంతకు నీ విషయం ఏమిటి మా చెల్లి కాయా, పండా అని అడిగేసరికి పుచ్చురా" అని ఫ్రస్ట్రేషన్ ఫేస్ తో చెప్పాడు తాగుబోతు రమేష్. ఇలా ఈ వారం స్కిట్స్ అన్నీ కూడా ఎంటర్టైన్ చేయడానికి 27 వ తేదీన ఈ ఎపిసోడ్ రాబోతోంది.