English | Telugu
ఏంటి సర్ ఈ ఓవరాక్షన్.. మారవా అర్జున్ ఇంక!
Updated : Jul 21, 2023
బిగ్ బాస్ 6 లో 'బ్యూటీ క్వీన్' అని శ్రీసత్యని చెప్తారు. ఆ తర్వాత వాసంతి కృష్ణన్ అని చెప్తారు. వీరిద్దరికి దగ్గర వచ్చిన అర్జున్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్తీసత్య వెంటే ఉంటూ తన లవ్ కోసం చాలా ప్రయత్నించి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకొచ్చేశాడు.
కొన్ని రోజుల క్రితం శ్రీసత్య పుట్టినరోజుని బిగ్ బాస్ ఫెండ్స్ అందరూ కలిసి గ్రాంఢ్ గా సెలబ్రేట్ చేశారు. కంటెస్టెంట్స్ దాదాపుగా అందరు వచ్చి సందడి చేశారు. బిబి జోడీ డాన్స్ షోలో శ్రీసత్యతో కలిసి మెహబూబ్ డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే మెహబూబ్ ఈ సెలబ్రేషన్స్ లో తన డ్యాన్స్ స్టెప్స్ తో ఫుల్ జోష్ గా కనిపించాడు. శ్రీసత్య కూడా చిందులు వేసింది. ఈ సెలబ్రేషన్స్ లో రాజ్, గీతూ రాయల్, ఆదిరెడ్డి, అర్జున్ కళ్యాణ్, ఫైమా, రేవంత్, యాంకర్ శివ ఇలా చాలా మంది హాజరయ్యారు. అందరూ సరదాగా గడుపుతూ శ్రీసత్యతో సందడి చేశారు. అయితే ఈ సెలబ్రేషన్స్ లో అందరి దృష్డి అర్జున్ కళ్యాణ్ మీదే ఉంది. అతనితో శ్రీసత్య ఎలా ఉంటుందా అని ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే శ్రీసత్య మాత్రం అందరితో ఉన్నట్టే మాములుగా ఉంది. అయితే గీతు రాయల్.. ఈ సెలబ్రేషన్స్ లో యాక్టివ్ గా ఉండి అందరిలో మంచి జోష్ ని నింపింది.
శ్రీసత్య పుట్టిన రోజు వేడుకల్లో కలిసిన బిగ్ బాస్-6 కంటెస్టెంట్స్.. అందరూ సరదగా ఎంజాయ్ చేశారు. అయితే బిగ్ బాస్ తర్వాత ఎవరి బిజీ లైఫ్ వాళ్ళు గడుపుతున్నారు. రేవంత్ కొత్త ఆల్బమ్స్ కోసం బిజీ అయ్యాడు. శ్రీహాన్ యాక్టింగ్ లో బిజీ, ఆదిరెడ్డి ఎప్పటిలాగే వ్లాగ్స్ చేస్తూ ఫుల్ ట్రెండింగ్ లో ఉంటున్నాడు. అయితే వాసంతి కృష్ణన్, అర్జున్ కళ్యాణ్ కలిసి ఒక సినిమాలో కూడా నటించారు. అయితే బిబి జోడీలో వీళ్ళిద్దరి డ్యాన్స్ పర్ఫామెన్స్ మాత్రం అదుర్స్ అనే చెప్పాలి. ఆయితే తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో అర్జున్ కళ్యాణ్ , వాసంతి కృష్ణన్ లతో కలిసి ఒక వీడీయోని శ్రీసత్య పోస్ట్ చేసింది. " ఓ మై గాడ్ శ్రీసత్య ఇన్ స్టాగ్రామ్ స్టాటస్ లో వాసంతి, ఇంకా అర్జున్ కళ్యాణ్ " అని అర్జున్ కళ్యాణ్ అనగా.. " ఏంటి సర్ ఈ ఓవరాక్షన్.. మారడు.. నువ్వు మారవా ఇంకా" అని అర్జున్ కళ్యాణ్ ని అనేసింది శ్రీసత్య. ఇది శ్రీసత్య తన స్టాటస్ లో పోస్ట్ చేసింది శ్రీసత్య.